భారత్ – పాకిస్థాన్ సరిహద్దుల్లో భారీ పేలుడు శబ్దం వినిపించింది. బార్మర్ జిల్లా సరిహద్దు ప్రాంతాల పౌరులు చెప్పిన ప్రకారం ..పేలుడు చాలా పెద్దదిగా ఉందని..ఆ శబ్ధం దాదాపు 50కిలో మీటర్ల వరకు వినిపించిందన్నారు. ఈ సంఘటన తర్వాత, పోలీసులు ఇతర ఏజెన్సీలకు సమాచారం ఇచ్చారు. అందిన సమాచారం మేరకు ప్రస్తుతం పోలీసులు పేలుడుకు సంబంధించిన సమాచారాన్ని సేకరిస్తున్నారు. బార్మర్ జిల్లాలోని బఖాసర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రజలు పెద్ద శబ్దం విన్నారని, ఇది జరగడానికి ముందు, ఆకాశంలో ప్రకాశవంతమైన కాంతి కూడా కనిపించిందని చెబుతున్నారు. . అదే సమయంలో, గుజరాత్‌లోని బార్మర్‌తో పాటు జలోర్ గ్రామాల్లో ఈ పేలుడు శబ్దం వినిపించిందని కూడా చెబుతున్నారు. అయితే ఈ పేలుడు భారత సరిహద్దులో జరిగిందా లేక పాకిస్థాన్ భూభాగంలో జరిగిందా అనేది ఇప్పటి వరకు స్పష్టంగా తెలియరాలేదు. ఎస్పీ తెలిపిన ప్రకారం, బార్మర్ పోలీసులు ఈ విషయంలో ఎయిర్ ఫోర్స్ .. బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్‌తో కూడా మాట్లాడారని, అయితే ఇప్పటివరకు ఎవరూ ధృవీకరించలేదు. మరోవైపు, పేలుడు కారణంగా ప్రజలు భయాందోళన చెందాల్సిన అవసరం లేదని బార్మర్ పోలీస్ సూపరింటెండెంట్ దీపక్ భార్గవ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అనే కోణంలో పోలీసులు సమాచారం సేకరిస్తున్నారు.
భారత్ – పాకిస్థాన్ సరిహద్దుల్లో భారీ పేలుడు – సమాచారం సేకరిస్తోన్న పోలీసులు
Advertisement
తాజా వార్తలు
Advertisement