గులాబీ వనంలో కమలం వేగులున్నారా? ఆ పార్టీ లీడర్ల ప్రతి మూమెంటును వాచ్ చేస్తూ.. టార్గెట్ పిక్స్ చేస్తున్నారా? ఎప్పటి ఇన్ఫోను అప్పడే చేరవేసే ప్లాన్ చేస్తున్నారా? అంటే అవుననే సమాధానాలే వినిపిస్తున్నాయి. ఎందుకంటే గులాబీ బాస్ కేసీఆర్, ఆ పార్టీ కీలక లీడర్లు చేస్తున్న కార్యక్రమాలన్నీ కమలం నేతలకు ఎప్పటికప్పుడు చేరడమీ దీనికి కారణంగా తెలుస్తోంది. ఇక ఈ మధ్య జరిగిన అయిదు రాష్ట్రాల ఎన్నికల్లో నాలుగు చోట్ల విజయకేతనం ఎగుర వేసిన కమలం పార్టీ తెలంగాణ వైపు ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది. ఈ మేరకు కమలనాథుల వ్యూహం ఊపందుకున్నది. పార్టీని సంస్థాగతంగా పటిష్టం చేసుకుంటూనే ఇతర పార్టీల్లోని అసంతృప్తవాదులను అక్కున చేర్చుకునే ప్రయత్నాలను వేగవంతం చేశారు. కాంగ్రెస్ ముక్తభారత్‌ను కోరుకుంటున్న బీజేపీ నేతలు ఆ పార్టీలోని కీలక నేతలపై దృష్టి కేంద్రీకరించారు. ప్రస్తుతానికి కాంగ్రెస్‌పైనే ఎక్కువ ఫోకస్ పెట్టింది. కాంగ్రెస్‌తో పాటు టీఆర్‌ఎస్‌లోని కొంత మంది అసంతృప్తులను చేర్చుకునేందుకు రంగం సిద్దం చేస్తోంది.
హైదరాబాద్, ఆంధ్రప్రభ : కాంగ్రెస్‌పైనే ప్రధానంగా ఫోకస్ పెట్టిన బీజేపీ అధికార టీఆర్‌ఎస్ పట్ల మాత్రం భిన్నమైన తీరులో స్కెచ్ వేసింది. కాంగ్రెస్ పట్ల కేసీఆర్ అనుసరించిన విధానాన్నే టీఆర్‌ఎస్ పట్ల అనుసరించాలని బీజేపీ భావిస్తున్నట్లు స్పష్టమవుతోంది. కేంద్రం నుంచి ఎప్పటికప్పుడు అంతర్గత సమాచారాన్ని కేసీఆర్ సేకరిస్తున్నట్లుగానే టీఆర్‌ఎస్‌లోని తాజా అప్‌డేట్స్ కోసం ఇన్‌ఫార్మర్ నెట్‌వర్క్‌ను ఏర్పాటుపై ప్రధానంగా ఫోకస్ పెట్టింది. ముల్లును ముల్లుతోనే తీసే ఎత్తుగడను రూపొందించుకున్న కమలం పార్టీ ఈ ఏడాది చివరికల్లా ఫస్ట్ ఫేజ్ వ్యూహాన్ని పూర్తి పూర్తి చేయాలని భావిస్తోంది. కాంగ్రెస్ పార్టీకి చెందిన కొంత మంది నేతలతో బీజేపీ ప్రత్యేక దూతలు సంప్రదింపులను పూర్తి చేశారు. కేంద్ర పార్టీ నేతలతోనూ మాట్లాడించి పార్టీలో చేరేలా చూశారన్న చర్చ జరుగుతోంది. అదే విధంగా ప్రతీ జిల్లాలో ఆ పార్టీలో అసంతృప్తితో ఉన్న వారెవరనేది గుర్తించడంతో పాటు వారిని పార్టీలోకి తీసుకు వచ్చేందుకు వీలుగా జిల్లాకో టీమ్‌ను కూడా రాష్ట్ర నాయకత్వం నియమించింది. రాష్ట్రంలోని ఉత్తరాదితో పోలిస్తే దక్షిణాది జిల్లాల్లో ఈ ప్రక్రియ ఒకింత వేగంగా జరుగుతున్నది. కాంగ్రెస్ పార్టీకి ప్టటు ఉన్న ఖమ్మం జిల్లాలోనూ స్పెషల్ టీమ్ రంగంలోకి దిగింది. తొందరలోనే ఈ జిల్లాకు చెందిన పలువురు నేతలు కాషాయ కండువా కప్పుకోబోతున్నారన్న ప్రచారం సాగుతోంది. ఇదే జరిగితే ఇంత వరకు ఖమ్మంలో ఏ మాత్రం ఉనికి లేని బీజేపీ రాబోయే రోజుల్లో తిరుగులేని శక్తిగా తయారవుతోంది.
టీఆర్‌ఎస్ విషయంలో మాత్రం ఇప్పటికిప్పుడే ఎవరిని టచ్ చేయవద్దనే ఎత్తుగడలను అవలంబిస్తున్నది. ప్రస్తుతం పార్టీలో అంటీముట్టనట్టుగా ఉండే సీనియర్ లీడర్లు వారంతట వారు నిర్ణయం తీసుకుంటే చేర్చుకోవడానికి రంగాన్ని సిద్ధం చేస్తున్నది. కానీ అక్కడ యాక్టివ్‌గా ఉన్న వారి జోలికి మాత్రం వెళ్ళకూడదని భావిస్తోంది. టీఆర్‌ఎస్‌లో ఉంటూనే ఆ పార్టీ కదలికలను తెలుసుకుంటూ సమాచారాన్ని అందించేలా ఇన్‌ఫార్మర్ తరహాలోనే ఆ నాయకులను వాడుకోవాలని పార్టీ వ్యూహంగా కనిపిస్తోంది.
జిల్లాకు ఒకరి చొప్పున ఇలాంటి వ్యక్తుల్ని తనవైపు తిప్పుకువాలన్న సంకల్పంతో ఉన్నది. వాస్తవానికి టీఆర్‌ఎస్ ఓవర్‌లోడ్‌లో ఉంది. ఒక్కో నియోజకవర్గంలో పదుల సంఖ్యలో అసెంబ్లిdకి పోటీ చేసే ఆఐషావహులున్నారు. వీరిలో ఎవరికి టికెటిచ్చినా మిగతా వారు తిరుగుబాటు జండా ఎగురవేయడం ఖాయమన్న అభిప్రాయంతో ఉన్న బీజేపీ అదను చూసి దెబ్బ కొట్టాలని చూస్తోంది. అప్పటి వరకు ఎలాంటి అనుమానం రాకుండా టీఆర్‌ఎస్‌లో కంటిన్యూ అవుతూనే ఉంటారు. టీఆర్‌ఎస్‌లో కోవర్టులుగా ఉన్న వారు ప్రధాని మోడీని వ్యక్తిగతంగా తిట్టినా, బీజేపీని, కేంద్ర ప్రభుత్వాన్ని తీవ్ర స్థాయిలో విమ్శలు చేసినా వారి జోలికి వెళ్లకూడదని నిర్ణయించింది. పైగా టీఆర్‌ఎస్‌లో నమ్మకైన లీడర్‌గా గుర్తింపు ఉండాలని కోరుకుంటుంది. ఇద్దరు మంత్రులు, కొద్ది మంది ఎమ్మెల్యేలు బీజేపీతో టచ్‌లో ఉన్నారంటున్నారు. బీజేపీని ఎదుర్కోవడానికి టీఆర్‌ఎస్ ఏం చేయబోతున్నది, గులాబీ బాస్ వ్యూహం ఎలా ఉంటున్నది, ఢిల్లీ టూర్‌ల ప్రాధాన్యత ఏంటి, జాతీయ రాజకీయాల్లో ఎలాంటి ప్లాన్ జరుగుతున్నది తదితర అంశాలను ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు ప్రత్యేక వ్యవస్థను కూడా బీజేపీ ఏర్పాటు చేసుకున్నట్లు పార్టీలో చర్చ జరుగుతోంది.