Tuesday, November 19, 2024

తెలుగు గడ్డపైనే జన్మించిన హనుమంతుడు

రామభక్తుడు వీరాంజనేయుడు పుట్టింది ఎక్కడో తేలిసిపోయింది. ఒక్క ఉదుటున సముద్రాన్ని దాటిన వాడు, రెప్పపాటులో లంకను దహనం చేసిన అరివీర భయంకరుడు జన్మించిన చోటుని కనిపెట్టారు. భక్తుడనే పేరుకి పర్యాయపదంగా మారిన హన్మంతుడు పుట్టింది ఎక్కడో కాదు తెలుగు నేలపైనే. మన గడ్డమీద పుట్టిన ఈ చిరంజీవి ఆ తర్వాత దేశవ్యాప్తంగా అందరికీ ఆరాధనీయుడు అయ్యాడు.

పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుమల గిరులపై ఆకాశగంగకు సమీపంలో ఉన్న అంజనాద్రి కొండల్లోనే హనుమాన్​ జన్మించాడని తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటించింది. అంజనాదేవి ఆకాశగంగ తీర్థంలో 12 ఏళ్ల పాటు తపస్సు చేయగా వాయుదేవుడు ప్రత్యక్షమై ఇచ్చిన ఫలాన్ని ఆమె తిన్నదని, ఆకాశగంగా సమీపంలోనే హనుమంతుడి జన్మస్థలమని తెలిపారు. ఈ మేరకు హన్మంతుడి జన్మస్థానం కనిపెట్టేందుకు ఏర్పాటైన కమిటీ నాలుగు నెలల పాటు వివిధ పరిశోధనలు చేసి ఈ విషయాన్ని వెలికితీసింది. ఈ మేరకు పరిశోధన వివరాలను కమిటీ సభ్యుడు మురళీధరశర్మ వెల్లడించారు. శాసనాలు, పురాణాలు, వాజ్మయ ప్రమాణాలు, భౌగోళిక అంశాలను పరిగణలోకి తీసుకుని హనుమంతుడి జన్మస్థలం తిరుమల గిరులే అని నిర్థారించినట్టు కమిటీ వెల్లడించింది. వెంకటాచల మహత్మంలోనూ అంజనాద్రి ప్రస్తావన ఉందని, ఇక్కడే అంజనాదేవికి హనునమంతుడు పుట్టాడని వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement