పెగాసస్ అంశం పార్లమెంట్ ను కుదిపేస్తోంది. పెగసస్ నిఘా వ్యవహారంపై విపక్షాల ఆందోళన నేపథ్యంలో పార్లమెంట్ ఉభయ సభలు ఈ నెల 9వ తేదీకి వాయిదా పడింది. అయితే వాయిదాకు మందు కీలకమైన పన్ను చట్టాల సవరణ బిల్లు లోక్‌సభలో ఆమోదం పొందింది.
కాగా, పెగాసస్ నిఘా వ్యవహారంపై పార్లమెంటు ఉభయసభల్లో విపక్షాల నిరసనలు కొనసాగుతున్నాయి. పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం అయినప్పటి నుంచి పెగాసస్ అంశంపై విపక్ష పార్టీలు ఆందోళన చేస్తున్నాయి. పెగసస్ సాఫ్ట్‌వేర్‌కు సంబంధించి పూర్తి వివరాలు బయటపెట్టాలని డిమాండ్ చేస్తూ విపక్ష సభ్యులు తీవ్ర స్థాయిలో ఆందోళనలు చేస్తున్నారు. ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేస్తున్నారు.