Friday, November 22, 2024

‘ఆధార్-ఓటర్’ బిల్లుకు లోక్​సభ ఆమోదం.. వ్య‌తిరేకించిన ప్ర‌తిప‌క్షాలు..

ఓటరు ఐడీని ఆధార్‌తో లింక్ చేయ‌డానికి సంబంధించిన ఎన్నిక‌ల చ‌ట్టాల స‌వ‌ర‌ణ 2021 బిల్లుకు లోక్‌స‌భ ఆమోదించింది. విపక్షాలు లఖింపూర్ ఖేరి ఘటనపై ఆందోళనలు చేస్తుండగానే.. సభలో కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు ఈ బిల్లును ప్రవేశపెట్టారు. అనంతరం మూజువాణి ఓటు ద్వారా దీన్ని సభ అమోదించిది. అయితే ఆందోళనలు ఎంతకీ ఆగకపోవడం వల్ల సభను రేపు ఉదయం 11గంటలకు వాయిదా వేశారు. ఎన్నిక‌ల చ‌ట్టాల స‌వ‌ర‌ణ బిల్లు 2021 బిల్లు ద్వారా…ఇక నుంచి ఓటు రిజిస్ట‌ర్ చేసుకోవాల‌నుకునే వారి నుంచి ఎన్నిక‌ల రిజిస్ట్రేష‌న్ ఆఫీస‌ర్లు ఆధార్ నెంబ‌ర్‌ను తీసుకుంటారు. ఐడెంటినీ గుర్తించేందుకు ఇది అవ‌స‌రం అవుతుంద‌ని కేంద్రమంత్రి కిర‌ణ్‌ రిజిజు తెలిపారు. బోగ‌స్ ఓటింగ్‌, న‌కిలీ ఓటింగ్‌ను నిర్మూలించాలంటే ఈ బిల్లుకు ఆమోదం త‌ప్ప‌ద‌ని మంత్రి తెలిపారు.

అయితే.. ఈ బిల్లును విప‌క్షాలు వ్య‌తిరేకించాయి. ఎన్నిక‌ల చ‌ట్టాల స‌వ‌ర‌ణ బిల్లును స్టాండింగ్ క‌మిటీకి సిఫార‌సు చేయాల‌ని కాంగ్రెస్ నేత అధిర్ రంజ‌న్ చౌద‌రి తెలిపారు. ఆధార్ చ‌ట్టం ప్ర‌కారం ఆధార్‌ను ఓట‌ర్ కార్డుతో అనుసంధానం చేయొద్ద‌ని కాంగ్రెస్ నేత మ‌నీష్ తివారీ అన్నారు. ఎన్నిక‌ల చ‌ట్టాల స‌వ‌ర‌ణ బిల్లును వెన‌క్కి తీసుకోవాల‌ని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. ఆధార్‌ను కేవ‌లం అడ్ర‌స్ ప్రూఫ్‌గా వాడాల‌ని, కానీ అది పౌర‌స‌త్వ ధ్రువీక‌ర‌ణ ప‌త్రం కాదు అని కాంగ్రెస్ నేత శ‌శిథ‌రూర్ అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement