Friday, November 22, 2024

లోక్​సభ నిరవధికంగా వాయిదా

లోక్​సభ నిరవధికంగా వాయిదా పడింది. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ఈనెల 13 వరకు జరగాల్సి ఉన్నా… రెండు రోజులు ముందే ముగిస్తున్నట్లు స్పీకర్ ఓం బిర్లా ప్రకటించారు. వర్షాకాల సమావేశాలు ప్రారంభమైనప్పటి నుంచి పెగసస్ వ్యవహారంపై విపక్షాలు తీవ్ర స్థాయిలో నిరసనలు చేపట్టాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ… సభా కార్యకలాపాలను అడ్డుకున్నాయి. ఓబీసీ బిల్లు మినహా ఇతర కీలక బిల్లులన్నీ ఈ గందరగోళం మధ్య ఎలాంటి చర్చ లేకుండానే ఆమోదం పొందాయి. మంగ‌ళ‌వారం లోక్‌స‌భ‌లో 127వ రాజ్యాంగ స‌వ‌ర‌ణ బిల్లుకు ఆమోదం తెలిపిన విష‌యం తెలిసిందే. 

Advertisement

తాజా వార్తలు

Advertisement