Friday, November 22, 2024

లాక్ డౌన్ ఎఫెక్ట్ నష్టాల్లో మార్కెట్లు

కరోనా కేసుల పెరుగుదల ఎఫెక్ట్ స్టాక్ మార్కెట్ భారీగా పడుతోంది. మళ్లీ లాక్ డౌన్ విధిస్తారు అన్న అపోహలతో లక్షల కోట్ల రూపాయల ఇన్వెస్టర్ల సందను క్షణాల్లో ఆవిరై పోయింది. దేశంలో కరోనావైరస్ కేసులు రికార్డు స్థాయిలో పెరగడంతో ఆర్థికవ్యవస్థపై నెలకొన్న ఆందోళనలు, లాక్‌డౌన్‌ భయాల నేపథ్యంలో  ఇన్వెస్టర్లు సోమవారం భారీ అమ్మకాలకుదిగారు. ఇంట్రా డేలో  సెన్సెక్స్ 1,470 పాయింట్లు పడిపోయి 47,362 వద్దకు చేరుకుంది. అంతకుముందు 48,832 వద్ద ముగిసింది. నిఫ్టీ కూడా 426 పాయింట్ల పతనమై 14200కు దిగువకు చేరింది.  దీంతో ఇంట్రా డేలో దాదాపు 6 లక్షల కోట్ల సంపద తుడిచిపెట్టుకుపోయింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement