Tuesday, November 26, 2024

ఆ మూడు నగరాల్లో లాక్ డౌన్!

దేశంలో కరోనా ఉదృతి కొనసాగుతోంది. దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ భయం వెంటాడుతోంది.  దీంతో పలు రాష్ట్రాల్లో ఇప్పటికే ఆంక్షలు విధించారు. మహమ్మారి అధికంగా ఉన్న మహారాష్ట్రలో కఠిన నిబంధనలు అమలు చేస్తున్నారు.  తాజాగా మధ్యప్రదేశ్ లో కూడా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి చౌహన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. భోపాల్, ఇండోర్, జబల్పూర్ నగరాల్లో ఆదివారం రోజున లాక్ డౌన్ విధించారు. మూడు రోజుల క్రితమే ఈ ప్రకటన చేయడంతో దానికి ప్రజలు కూడా సన్నద్ధం అయ్యారు.  రాత్రి నుంచి  మూడు నగరాలు మూగబోయాయి. మార్చి 31 వరకు స్కూళ్లు, విద్యాసంస్థలు మూసివేయాలని ప్రభుత్వం ఆదేశించింది. మధ్యప్రదేశ్ లో శుక్రవారం 1,140 కరోనా కేసులు నమోదుయ్యాయి. దీంతో ఇప్పుటి వరకు మొత్తం కేసుల సంఖ్య 2,73,079 చేరింది. ప్రస్తుతం రాష్ట్రం 6,600కిపైగా యాక్టివ్ కేసులు ఉన్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement