కరుణ కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి రోజూ మూడు లక్షల పైన కేసులు వస్తున్నాయి. ఇక ముందు ఎన్ని కేసులు పెరుగుతాయమేది ఎవరికీ అంతు పట్టడం లేదు. ఇప్పటికే చాలా రాష్ట్రాలు నైట్ కర్ఫ్యూ వీకెండ్ లాక్ డౌన్ లను అమలు చేస్తున్నాయి. ఇక కరోనా కట్టడికి మిగిలి ఉన్న ఒకే ఒక చివరి అవకాశం కంప్లీట్ లాక్ డౌన్. దేశంలో కరోనా నిబంధనల అమలు, మరోమారు లాక్ డౌన్ తప్పదేమోనన్న భయాలు వెంటాడుతున్నాయి. దీంతో నిత్యవసరాల డిమాండ్ పెరిగిపోయింది. మరోమారు లాక్ డౌన్ తప్పదేమోనన్న భయాలు, పప్పు దినుసులు, వంట నూనెలు, బియ్యం, శానిటైజర్లు, మాస్క్ లు, ఆక్సీమీటర్లు తదితరాలకు డిమాండ్ ను పెంచడంతో వాటి ధరలు గణనీయంగా పెరిగాయి. పలు ప్రాంతాల్లో మినీ లాక్ డౌన్ లు అమలవుతూ ఉండటంతో, వస్తు ఉత్పత్తుల సరఫరాకు అంతరాయాలు ఏర్పడుతున్నాయి.
తమకు నిత్యావసరాల డెలివరీలు ఆలస్యం అవుతున్నాయని ఢిల్లీ, ముంబై సహా పలు ప్రాంతాల్లోని ప్రజలు వాపోతున్నారు. గడచిన కొన్ని రోజులుగా కూరగాయలు, పండ్ల ధరలు కూడా పెరిగినట్లు న్యూఢిల్లీకి చెందిన నేహా గ్రోవర్ వ్యాఖ్యానించారు. ఆన్ లైన్ మార్కెట్ ప్లేస్ కు ఆర్డర్లు వస్తున్నప్పటికీ, డెలివరీలను అందించేందుకు ఉద్యోగులు లభించడం లేదని అన్నారు. గ్రేటర్ నోయిడా ప్రాంతంలో కొబ్బరి నీరు కూడా లభించే పరిస్థితి లేదని, మొన్నటి వరకూ రూ. 35 వరకూ ఉన్న కొబ్బరి బొండాం ధర, ఇప్పుడు 80 రూపాయలకు చేరిందని అన్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే ప్రజలు నిత్య అవసరాల కోసం వేచి చూడాల్సిన దీన స్థితి వస్తుందని కాబట్టి..ప్రభుత్వం ముందస్తుగానే నిత్య అవసరాల సరఫరాలు సక్రమంగా జరిగేటట్లు చర్యలు తీసుకోవాలని అని నిపుణులు హెచ్చరిస్తున్నారు.