Sunday, November 3, 2024

చైనాలో మళ్లీ లాక్ డౌన్.. మరో వైపు భూకంపం విధ్వంసం..

చైనాలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. దీంతో అక్కడ మళ్లీ లాక్ డౌన్ విధించారు. 70 నగరాల్లో కరోనా ఆంక్షలు విధించారు. కరోనా ఆంక్షల కారణ అధికారులను ప్రజలను బయటకు రానివ్వడం లేదని ఆందోళన చెందుతున్నారు. చైనాలో ముఖ్య‌మైన 30 సిటీల్లో ప్ర‌భుత్వం కోవిడ్ ఆంక్ష‌లు విధించిందని అక్క‌డికి మీడియా సంస్థ‌లు నివేదించాయి. అయితే వీటి వ‌ల్ల ట్రాన్స్ పోర్ట్ పై, ఎకానమీపై తీవ్ర ప్ర‌భావం ప‌డే అవ‌కాశం ఉంది. అయితే ఈ లాక్ డౌన్ ఎంత కాలం పాటు ఉంటుంద‌నే విష‌యంలో అక్క‌డి ప్ర‌భుత్వం క్లారిటీ ఇవ్వ‌లేదు. విద్యార్థులు కూడా ఆన్ లైన్ క్లాసుల ద్వారా పాఠాలు వింటున్నారు. త్వ‌ర‌లో చైనాలో స్కూల్స్ కు సెల‌వులు రానున్నాయి.

ఇదిలా ఉండగా.. చైనా సిచువాన్‌లో సోమవారం సంభవించిన భారీ భూకంపం పెను విధ్వంసం సృష్టించింది. ప్రకృతి ప్రకోపానికి 46 మంది ప్రాణాలు కోల్పోయారు. రిక్టర్ స్కేల్‌పై భూకంప తీవ్రత 6.8తో ప్రకంపనలు వచ్చాయి. చాలాచోట్ల భవనాలు భవనాలు కూలిపోగా.. పలుచోట్ల చిక్కుకున్న 50వేలమందికి పైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. సిచువాన్‌లో 6500 రెస్క్యూ టీమ్‌లను, నాలుగు హెలికాప్టర్లను మోహరించారు. దీంతో పాటు 1,100 అగ్నిమాపక దళ బృందాలను రంగంలోకి దింపారు. ఆర్థిక మంత్రిత్వ శాఖ 50 మిలియన్ యువాన్లను రెస్క్యూ, రిలీఫ్ ఫండ్‌ను విడుదల చేసింది. ప్రాంతీయ ప్రభుత్వం కూడా గంజికి 50 మిలియన్ యువాన్లను కేటాయించింది. అయితే చైనాలో గతంలో కూడా భూంకంపం వచ్చిన సందర్భంగా వేల మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement