Tuesday, November 19, 2024

మిడ్ డే మీల్స్ సాంబారులో బల్లి.. 70 మంది స్టూడెంట్స్ కి అస్వస్థత..

కర్నాటక రాష్ట్రంలోని చామరాజనగర్ జిల్లా వడకెహల్లా గ్రామంలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనం తిన్న 70 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. కడుపునొప్పి, వాంతులు అవుతున్నాయని స్టూడెంట్స్ కంప్లెయింట్ చేయడంతో ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కాగా, వారందరినీ సమీపంలోని హాస్పిటళ్లకు తరలించి చికిత్స అందించారు. విద్యార్థులు ప్రమాదం నుంచి బయటపడ్డారని, ఇప్పుడు వారికి ఎట్లంటి ప్రాబ్లం లేదని చికిత్స అందిస్తున్న వైద్యులు తెలిపారు.

మధ్యాహ్నం భోజనం వడ్డించే ‘సాంబార్’ (పప్పు, కూరగాయల పులుసు) లో బల్లి ఉన్నట్టు వంట మనిషి చూశాడని, వెంటనే తినడం ఆపేయాలని విద్యార్థులను హెచ్చరించినట్టు చామరాజనగర్ జిల్లా పబ్లిక్ ఇన్‌స్ట్రక్షన్ డిప్యూటీ డైరెక్టర్ మంజునాథ్ తెలిపారు. కాగా, తల్లిదండ్రులు, పాఠశాల యాజమాన్యంతో ప్రజా బోధనా విభాగం మీటింగ్ ఏర్పాటు చేసింది. సమావేశం తర్వాత ఈ నిర్లక్ష్యంపై చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.  

అయితే.. పెరుగుతున్న కొవిడ్ కేసుల కారణంగా బెంగళూరు సిటీలో స్కూల్స్, కాలేజీలు మూసివేసినప్పటికీ రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో పాఠశాలలు, కళాశాలలు ఇంకా కొనసాగుతున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement