Thursday, November 21, 2024

లివ‌ర్ పై డాక్ట‌ర్ ఆటోగ్రాఫ్ – ఎంత దారుణం

ఓ పేషెంట్ కు కాలేయ మార్పిడి చేసిన డాక్ట‌ర్ ఆ అవ‌యవంపై త‌న ఆటోగ్రాఫ్ ను చెక్క‌డంతో వార్త‌ల్లోకి ఎక్కాడు. ఆప‌రేష‌న్ పెయిల్ కావ‌డంతో పేషెంట్ లివ‌ర్ పై 1.6అంగుళాల సైజులో అక్ష‌రాలు ఉండ‌టంతో మ‌రో డాక్ట‌ర్ దీన్ని గుర్తించ‌డంతో ఈ విష‌యం బ‌య‌టికి వ‌చ్చింది. ఈ ఘ‌ట‌న బ్రిటన్‌లోని బర్మింగ్‌హామ్ క్వీన్ ఎలిజబెత్ హాస్పిటల్‌లో చోటు చేసుకుంది. సర్జన్ స్పెషలిస్ట్ డాక్టర్ సైమన్ ఈ దారుణానికి ఒడిగట్టాడు. 2013లో జరిగిన ఈ సంఘటనపై ట్రైబ్యునల్ తీర్పుతో తాజాగా సంచలనమైంది. ఆర్గాన్ బీమ్ మెషీన్‌ను ఉపయోగించి పేషెంట్ లివర్‌పై ఆటోగ్రాఫ్ చెక్కినట్లు డాక్టర్ సైమన్ అంగీకరించాడు. కాగా ఆ డాక్టర్‌కు 2017లోనే రూ.10లక్షల ఫైన్ వేసిన కోర్టు, వైద్య వృత్తి నిర్వహించకుండా 2020, డిసెంబర్‌లో సస్పెన్షన్ విధించింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement