అతి ప్రమాదకరమైన వ్యాధుల్లో క్యాన్సర్ కూడా ఒకటి. ఈ క్యాన్సర్ లో ఎన్నో రకాలు ఉన్నాయి..బ్రెస్ట్, స్టమక్,,త్రోట్ క్యాన్సర్ ఇలా ఎన్నో ఉన్నాయి. అయితే సామాన్యుల సంగతేమో కానీ ధనవంతులకి క్యాన్సర్ వస్తే విదేశాలకు వెళ్లి చికిత్స చేయించుకుని వస్తుంటారు. మరి సామాన్యుల మాటేంటి..వారు ఖరీదైన వైద్యాన్ని చేయించుకోలేరన్న సంగతి తెలిసిందే. అయితే మన ఇండియాలో కాలేయ క్యాన్సర్ కి ఉపయోగపడే మొక్కలు ఉన్నాయని పరిశోధనలో తేలింది. మరి అవి ఎక్కడ ఉన్నాయో తెలుసుకుందాం..
కేరళలో విరివిగా కనిపించే మనతక్కలి మొక్క కాలేయ క్యాన్సర్ చికిత్సలో ఉపయోగపడుతుందని అమెరికాకు చెందిన ఎఫ్‌డీఏ అధికారికంగా గుర్తించింది.ఈ మొక్కలోని ఆకుల్లో ఉండే ఆట్రోసైడ్-డీ అనే పదార్థం లివర్ క్యాన్సర్ ఔషధాల తయారీలో దోహదం చేస్తుందని స్పష్టం చేశారు. ఆట్రోసైడ్-డీని మొట్టమొదటగా రాజీవ్ గాంధీ సెంటర్ ఫర్ బయోటెక్నాలజీ శాస్త్రవేత్తలు గుర్తించారు. లివర్ క్యాన్సర్ చికిత్సకు ఇప్పటివరకు ఎఫ్‌డీఏ ఆమోదం తెలిపిన ఔషధం కేవలం ఒకటే ఉంది. తాజాగా చేసిన పరిశోధనలో మనతక్కలి మొక్క ఔషధాల తయారీకి ఉపయోగపడుతుందని సీనియర్ సైంటిస్ట్ రూబీ జాన్ ఆంటో వెల్లడించారు. దీనివల్ల కాలేయ క్యాన్సర్ రోగులకు మేలు జరగనుంది.