ఉద్యోగులు ఎవరో చెప్పిన మాటలు విని సమ్మెకు వెళ్లొద్దని ఏపీ మంత్రి పేర్ని నాని అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ… ఆశించిన మేరకు పీఆర్సీ ఇవ్వకపోవడం బాధాకరమే..అన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులను అర్థం చేసుకోవాలన్నారు. భావోద్వేగంతో నిర్ణయాలు తీసుకోవద్దన్నారు. టీడీపీ హయాంలో ఒక్క ఉద్యోగమైనా ఇచ్చారా అని అన్నారు. కొత్త పీఆర్సీతో ప్రభుత్వంపై ఏటా రూ.10,247కోట్ల భారం పడుతుందన్నారు. జీతాలు తగ్గుతాయన్నవాదనకు ఆస్కారం ఎక్కడుందని అన్నారు. యూనియన్ నేతలు ఉద్యోగులను తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు. ఉద్యోగులను రెచ్చగొట్టడం కరక్టేనా అని మంత్రి ప్రశ్నించారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..