స్టాక్ మార్కెట్ లో అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీ కంపెనీలకి చెందిన షేర్ల విలువ బాగా పెరగడంతో ప్రపంచంలో అత్యంత ధనవంతుల జాబితాలో గౌతమ్ అదానీ రెండో స్థానానికి చేరారు. ఆయన రెండో స్థానానికి చేరారని ఫోర్బ్స్ రియల్ టైమ్ బిలియనీర్స్ సూచీ తెలిపింది. ప్రస్తుతం ప్రపంచంలో అత్యంత ధనవంతుడిగా టెస్లా, స్పేస్ ఎక్స్ సంస్థల అధినేత ఎలన్ మస్క్ ఉండగా.. ఫ్రాన్స్ కు చెందిన బెర్నార్డ్ ఆర్నాల్డ్ మూడో స్థానంలో అమెజాన్ అధిపతి జెఫ్ బెజోస్ నాలుగో స్థానంలో ఉన్నారు. దాదాపు మూడేళ్లుగా సంపద విలువలో అత్యంత వేగంగా ఎదుగుతూ వచ్చిన అదానీ.. ప్రస్తుతం ప్రపంచంలోనే రెండో స్థానానికి ఎగబాకి రికార్డు సృష్టించారు. ఈ స్థాయికి చేరిన తొలి ఆసియా వ్యక్తి, భారతీయుడు కూడా అదానీయే కావడం గమనార్హం. ఆయన కంపెనీ షేర్ల ధరలు పెరగడంతో సంపద 155.7 బిలియన్ డాలర్లకు చేరినట్టు ఫోర్బ్స్ రియల్ టైమ్ సూచీ వెల్లడించింది. బ్లూమ్ బెర్గ్ బిలియనీర్స్ సూచీలో మాత్రం గౌతమ్ అదానీ మూడో స్థానంలో ఉన్నారు. ఆ సూచీ ముందురోజు స్టాక్ మార్కెట్లు ముగిసే సమయానికి ఉన్న విలువను పరిగణనలోకి తీసుకుంటుంది. అందువల్ల శుక్రవారం అదానీ కంపెనీల షేర్లు పెరిగిన విలువ అందులో జమ కాలేదు.
Advertisement
తాజా వార్తలు
Advertisement