ఈ సంవత్సరం కేరళ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ జరగనుంది. కాగా ఈ ఈవెంట్ కి చీఫ్ గెస్ట్ గా హాజరయ్యే ముఖ్య అథితులంతా చాలా ప్రత్యేకత వున్నవారే. ఉగ్రవాదుల దాడిలో రెండు కాళ్ళు పోగొట్టుకున్న టర్కీకి చెందిన మహిళా దర్శకురాలు లిసా చలాన్ కేరళ ఫిలిం ఫెస్టివల్ కి చీఫ్ గెస్ట్ గా హాజరు కాబోతున్నారు. గతంలో జరిగిన ఉగ్రవాదుల సూసైడ్ అటాక్ లో ఆమె రెండు కాళ్ళు పోయాయి. చావు అంచుల వరకు వెళ్లి ఆమె బతికారు. కానీ సినిమాపై ఆమె ఆసక్తి మాత్రం తగ్గలేదు. ప్రస్తుతం లిసా చలాన్ ఆర్టిఫీషియల్ లెగ్స్ తో ఉన్నారు. కాళ్ళు పోగొట్టుకోవడం మాత్రమే కాదు.. ఆమె జీవితంలో ఎన్నో విషాదకర సంఘటనలు జరిగాయి. కానీ వేటికి కుంగిపోకుండా లిసా తన జీవనం సాగిస్తున్నారు. అందరికి ఆదర్శంగా నిలిచిన లిసాని కేరళ ఫిలిం ఫెస్టివల్ నిర్వాహకులు ఆమెని చీఫ్ గెస్ట్ గా ఆహ్వానించనున్నారు. కేరళ ఫిలిం ఫెస్టివల్ లో ఆమెని సన్మానించి రూ . 5 లక్షల రివార్డ్ కూడా ప్రకటించనున్నారు. లిసా చలాన్ దర్శకత్వంలో వచ్చిన తొలి చిత్రం ‘ ది లాంగ్వేజ్ ఆఫ్ ది మౌంటైన్స్’ని ఫిలిం ఫెస్టివల్ లో ప్రదర్శించనున్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..