Friday, November 22, 2024

సంక్రాంతికి రూ.100కోట్ల మ‌ద్యం విక్ర‌యాలు – ఎక్క‌డంటే

పండుగ పుణ్య‌మా అని వంద‌కోట్ల‌కు పైగా మ‌ద్యం విక్ర‌యాలు జ‌రిగాయ‌ని ఆబ్కారీశాఖ వెల్ల‌డించింది. సంక్రాంతి సంద‌ర్భంగా గ్రేట‌ర్ లో మ‌ద్యం అమ్మ‌కాలు జోరందుకున్నాయి. అత్య‌థికంగా రంగారెడ్డి జిల్లాలో రూ. 55 కోట్ల మేరకు మద్యం అమ్మకాలు జరిగాయ‌ట‌. ఇక హైదరాబాద్ లో రూ. 25 కోట్లకు పైగా లిక్కర్ అమ్ముడయ్యింది. మేడ్చల్ జిల్లాలో రూ. 20 కోట్ల మేర అమ్మకాలు జరిగినట్లు అంచనా. సాధారణంగా దసరా, డిసెంబర్ 31 సందర్భంగా మద్యం అమ్మకాలు భారీగా పెరుగుతాయి. సంక్రాంతి సందర్భంగా వరుస సెలవులు రావడంతో మద్యం ప్రియులు ఇలా పండగ చేసుకున్నారు.ఇదిలా ఉండగా, డిసెంబర్ 31.. ఏడాది చివరి రోజు 2021 సంవత్సరానికిగాను ముగింపు రోజు… ప్రతి ఏడాది డిసెంబర్ 31 అంటే ఖ‌చ్చితంగా పార్టీ చేసుకోవాల్సిందే. పార్టీ అంటే మందు ఉండాల్సిందే. ఏటా అందుకే మద్యం అమ్మకాల్లో జోరు కనిపిస్తుంది. డిసెంబర్ 31న కూడా అదే జోరు కనిపించింది.

కరోనా ఆంక్షల కారణంగా మద్యం అమ్మకాలకు కొంత సమయం వరకే అనుమతి ఇచ్చినా.. తర్వాత దానిని పొడిగించారు. దీంతో డిసెంబర్ 31 ఏ బార్ లో చూసిన మందుబాబుల హడావుడి కనిపించింది. బార్ అండ్ రెస్టారెంట్లు కళ కళ‌లాడాయి. ఏడాది మొత్తం రోజుల్లో ఏరోజు జరగని సేల్స్ డిసెంబర్ 31 నాడు జరిగాయి. డిసెంబర్ 31 ఒక్కరోజే రూ.171 కోట్ల మందు అమ్ముడుపోయిందని ఎక్సైజ్ శాఖ అధికారులు తెలిపారు. ఈ ఏడాది జరిగిన మద్యం అమ్మకాల వివరాలను ఎక్సైజ్ శాఖ విడుదల చేసింది. మొత్తం ఏడాదిలో జరిగిన అమ్మకాల కంటే గడిచిన ఐదు నెలల్లోనే ఎక్కువగా అమ్మకాలు జరిగాయి అని తెలిపింది. గడిచిన అన్ని నెలల్లో కంటే డిసెంబర్లోనే 3,435 కోట్ల లిక్కర్ సేల్ జరిగిందని పేర్కొంది. గతేడాది చివరి నెలలో 2,764 కోట్ల సేలింగ్ జరిగింది. గత ఏడాది మొత్తం 25,602 కోట్ల మందు అమ్ముడుపోయి ఉందని తెలంగాణ ఎక్సైజ్ శాఖ తెలిపింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement