Saturday, November 23, 2024

ల‌య‌న్స్ క్ల‌బ్ సేవ‌లు హ‌ర్ష‌నీయం – మంత్రి ఎర్ర‌బెల్లి

హ‌నుమ‌కొండ : సామాజిక సేవా కార్య‌క్ర‌మాల్లో ల‌యన్స్ క్ల‌బ్ సేవ‌లు అభినంద‌నీయ‌మ‌ని రాష్ట్ర పంచాయ‌తీరాజ్‌, గ్రామీణాభివృద్ది, గ్రామీణ నీటిసర‌ఫ‌రా శాఖా మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్‌రావు కొనియాడారు. ములుగురోడ్ లోని వ‌జ్ర గార్డెన్స్‌లో ల‌య‌న్స్ క్ల‌బ్ ఇంట‌ర్నేష‌న్‌, గౌత‌మ్‌ బుధ్ద రీజియ‌న్ మీట్‌లో మంత్రి పాల్గొన్నారు. లయన్స్ రీజినల్ చైర్మన్ గా నూత‌నంగా ఎంపికైన చెన్నమనేని జయశ్రీ, త‌దిత‌రులను మంత్రి అభినందించి, సావ‌నీర్‌ను విడుద‌ల చేశారు. మన సమాజంలో ఆపదలో ఉన్న పొరుగువారికి సహకారం అందించాలనే సదాశయంతో ల‌య‌న్స్ క్ల‌బ్ ఏర్ప‌డ‌టం అభినందనీయమ‌ని అన్నారు. ‘ మేము సేవ చేస్తాం’. అనే నినాదంతో సమాజములో విభిన్న జాతులు మతాలు, సాంప్రదాయలు కలిగియున్న ప్రజల మధ్య స్నేహ పూర్వక వాతావరణాన్ని కలిగిస్తూ అవసరార్థులను అవసరమైన సమయంలో ఆదుకొంటు, ప్రపంచములోని అతిపెద్ద సభ్యులను కలిగిన స్వచ్చంద‌ సేవా సంస్థగా ల‌య‌న్స్ క్ల‌బ్ ప్రజల మన్నలను పొంద‌డం గ‌ర్వ‌కార‌ణ‌మ‌ని అన్నారు.

ఎలాంటి లాభాపేక్ష లేకుండా వివిధ లయన్స్ క్లబ్స్ సమాజానికి పలు సామాజిక సేవలు అందించడం అభినందించదగ్గ విషయము. పేద వ‌ర్గాల‌కు కార్పోరేట్ స్థాయి విద్య‌నందించాల‌న్న సంక‌ల్పంతో ప్ర‌భుత్వం మ‌న ఊరు-మ‌న బ‌డి కార్య‌క‌ర్ర‌మాన్ని నిర్వ‌హిస్తుంద‌ని, ప్ర‌భుత్వం చేప‌ట్టిన బృహ‌త్త‌ర కార్య‌క్ర‌మానికి స్వ‌చ్చంధ సేవా సంస్థ‌లు సూచ‌న‌లు, స‌ల‌హాలు అందిస్తూ.. భాగ‌స్వామ్యం కావాల‌ని పిలుపునిచ్చారు. ల‌య‌న్స్ క్ల‌బ్ ద్వారా క‌రోనా స‌మ‌యంలో తీసుకొన్న చ‌ర్య‌ల‌ను కొనియాడారు. ఆర్థికంగా ఎత్త ఎత్తుకు ఎదిగినా.. న‌లుగురుని ఆదుకున్న‌ప్పుడే తృప్తి, పేరు ప్ర‌ఖ్యాత‌లు వ‌స్తాయ‌ని అన్నారు. కార్య‌క్ర‌మంలో ల‌య‌న్స్ క్ల‌బ్ స‌భ్యులు, ప‌లువురు సామాజిక వేత్త‌లు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement