జర్మనీకి చెందిన ఓ బిలయనీర్ రాదిమ్ పసేర్ తన బుగాటి కారును అత్యంత వేగంగా నడిపాడు. గంటకు 417 కిలోమీటర్ల వేగంతో బుగాటి సూపర్ కారును నడిపినట్టు ఓ వీడియో బయటికికొచ్చింది. ఈ ఘటనలో ఆ కారు యజమానికి రెండేళ్ల జైలుశిక్ష పడే అవకాశం ఉందని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. బుగాటి చిరాన్ కారును అతను ఫుల్ స్పీడ్తో డ్రైవ్ చేసినట్టు తెలుస్తోంది. సుమారు 10 మిలియన్ల పౌండ్ల ఖరీదైన ఆ కారుతో అక్రమ రీతిలో రేస్లో పాల్గొన్నట్టు రాదిమ్పై ఆరోపణలున్నాయి.
ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న కార్లలో బుగాటి చిరాన్ అత్యంత వేగవంతమైనదిగా పేరుంది. స్పీడోమీటర్లో ఆ కారు 417 కిలో మీటర్ల వేగంతో వెళ్లినట్టు హై స్పీడ్ రీడింగ్ ట్రాకర్ చూపిస్తోంది. బెర్లిన్, హన్నోవర్ మధ్య ఉన్న రూట్లో బుగాటి కారును స్పీడ్గా ప్రయాణించినట్టు వీడియో ద్వారా అర్థమవుతోంది. అని పోలీసు అధికారులు తెలిపారు. 1500 హార్స్పవర్ ఇంజిన్తో బుగాటి చిరాన్ గంటకు 420 కిలోమీటర్ల వేగంతో టాప్ స్పీడ్లో వెళ్తుందని దాని ఫీచర్స్ తెలియజేస్తున్నాయి.