రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఘోరం జరిగింది. మారిన వాతావరణంతో ఈదురు గాలుల వీస్తున్నాయి. ఈ క్రమంలో ఉరుములు, మెరుపులు ఒక్కసారిగా వచ్చాయి. అంతేకాకుండా పిడుగుపడి ఐదుగురు రైతులు గాయపడిన ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం మామిడిపల్లి లో శనివారం సాయంత్రం చోటు చేసుకుంది.
ఈదురు గాలులతో భారీ వర్షం పడటంతో పాటు ఐకేపీ సెంటర్ లో పిడుగు పడటంతో ధాన్యం విక్రయించేందుకు వచ్చిన ఐదుగురు రైతులు గాయపడ్డారు. గాయపడిన రైతులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి జిల్లా వైద్యాధికారి సుమన్ మోహన్ రావు ను ఆదేశించారు.