పొద్దంతా ఎండలతో భయపెట్టిన వాతావరణం.. సాయంకాలానికి చల్లబడింది. ఉన్నట్టుండి ఈదురుగాలులు మొదలయ్యాయి. ఆకాశంలో కారుమబ్బులు కమ్ముకున్నాయి. ఒక్కసారిగా ఉరుములు, మెరుపులు ప్రారంభమై పెళపెళా శబ్ధాలు వినిపించాయి. ఇవ్వాల (బుధవారం) సాయంత్రం కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూర్ మండలంలో పిడుగులు పడ్డాయి. కుంటాల, మానేపల్లి గ్రామాల సమీపంలోని తాటి చెట్టుపై పిడుగు పడటంతో మంటలు చెలరేగాయి. ఒక్కసారిగా పెద్ద పెద్ద సౌండ్స్ రావడం, అంతలోనే పిడుగు పడటంతో గ్రామస్తులు భయాందోళనకు గురయ్యారు.
Big Breaking | తాటిచెట్టుపై పిడుగుపాటు.. అంటుకున్న మంటలు (వీడియో)
Advertisement
తాజా వార్తలు
Advertisement