తెలంగాణలో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. రాష్ట్రంలో రాబోయే మూడు రోజులు కొన్నిచోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉత్తర దక్షిణ ఉపరితల ద్రోణి.. నైరుతి మధ్యప్రదేశ్ దాని పరిసర ప్రాంతాల నుంచి మరాట్వాడా దక్షిణ మధ్య మహారాష్ట్ర, దక్షిణ కర్ణాటక తీరం వరకు మట్టానికి 0.9 కిలోమీటర్ల వరకు ఏర్పడి ఉన్నట్లు అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో తెలంగాణలో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షంతో పాటు ఒకటి రెండు చోట్ల వడగండ్లు కూడా పడతాయని తెలిపింది. ఉత్తర, పశ్చిమ తెలంగాణ జిల్లాలో వడగండ్ల ప్రభావం ఉంటుందని వెల్లడించింది.
తెలంగాణలో ఇటీవల కురిసన అకాలవర్షం రైతులకు అపార నష్టం మిగిల్చింది. పలు జిల్లాల్లో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో వర్షాలు కురవడంతో ధాన్యం తడిసిపోయింది. మామిడి రైతులు ఇబ్బందిపడ్డారు. రాబోయే మూడు రోజులు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ సూచనతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ చదవండి: కేసీఆర్ ఆలోచనలు అమలు చేస్తామన్న మోదీ…