Thursday, November 21, 2024

Life Time – ఆ 37 మంది డిబార్ … టి ఎస్ పిఎస్ సి

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ బ్యూరో: నియామక పరీక్షల కు సంబందించిన ప్రశ్న పత్రాల లీకేజీ వ్యవహారంలో తెలంగాణ స్టేట్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రశ్నపత్రాల లీకేజీతో సంబంధం ఉన్న 37 మంది అభ్యర్థులను డీబార్‌ చేయాలని నిర్ణయించింది. సిట్‌ అరెస్టు చేసిన 37 మంది ఇకపై టీ-ఎస్‌పీఎస్సీ నిర్వహించే ఎటు-వంటి నియామక పరీక్షలకు దరఖాస్తు చేసుకునే వీలు లేకుండా చేస్తూ పబ్లీక్‌ సర్వీస్‌ కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. దీనిపై అభ్యంతరా లుంటే రెండు రోజుల్లో వివరణ ఇవ్వాలని 37 మంది నిందితులకు టీ-ఎస్‌పీఎస్సీ నోటీ-సులు జారీ చేసింది. కాగా సంచలనం సృష్టించిన పేపర్‌ లీకేజీలో తవ్వే కొద్ది అక్రమాలు వెలుగు చూస్తున్నాయి.

లీకేజీ వ్యవహారంతో కమిషన్‌ పలు పరీక్షలను రద్దు చేయగా.. మరికొన్ని పరీక్షలను వాయిదా వేసింది. మరోవైపు ఈ కేసులో సిట్‌, ఈడీ అధికారులు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నాయి. ఈ కేసుకు సంబంధించి ఇప్పటి వరకు ప్రత్యేక దర్యాప్తు బృందం 44 మందిపై కేసు నమోదు చేయగా.. 43 మందిని అదుపులోకి తీసుకుని విచారిస్తోంది .మొన్నటిదాకా ఇదంతా కేవలం ప్రశ్న పత్రాలు చేతులు మారిన వ్యవహారమని అధికారులు భావించారు.తాజాగా బ్లూటూత్‌ -టె-క్నాలజీని వినియోగించి తెలంగాణ స్టేట్‌ పబ్లీక్‌ సర్వీస్‌ కమిషన్ను లో చీటింగ్‌ చేసినట్లు- దర్యాప్తులో వెల్లడైంది.మరో వైపు ఈ కేసులో రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తోంది. లీకేజీకి పాల్పడిన వారు వ్యవస్థను మోసం చేయడానికి చాట్‌ జిపిటి ని ఉపయోగించినట్లు- సిట్‌ గుర్తించింది. అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌, డివిజనల్‌ అకౌంట్స్‌ ఆఫీసర్‌ రిక్రూట్‌మెంట్‌ కోసం ప్రశ్నపత్రాలను కాపీ చేసిన తర్వాత నిందితులలో ఒకరు సమాధానాలు పొందడానికి ఆర్టిఫీషియల్‌ ఇం-టె-లిజెన్స్‌ (ఏఐ) సాంకేతికతను ఉపయోగించినట్లు- లీక్‌పై దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం కనుగొంది.

అరెస్ట్‌లు వందకు చేరే అవకాశం
ఈ కేసులో అరెస్టుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. తాజాగా జరిగిన సిట్‌ దర్యాప్తులో పలు కీలక విషయాలు బయటకు వచ్చాయి. ఏఈఈ, డీఏఓ పరీక్షలు రాసిన అభ్యరులకు పరీక్ష హాలులోకి సమాధా నాలు చేరవేసినట్టు-… సిట్‌ గుర్తించింది. అందుకు ఒక ఎగ్జామినర్‌ సహక రించినట్లు- తేలింది. టీఎస్‌ఎస్పీడీసీఎల్‌ జూనియర్‌ అసిస్టెంట్‌ సురేష్‌ ద్వారా డీఈ రమేశ్‌… కొన్ని ప్రశ్నపత్రాలు తీసుకొని అమ్మినట్లు- తెలుస్తోంది. మరికొందరి కోసం ఏఈఈ, డీఏఓ ప్రశ్నపత్రాలు సేకరించేందుకు… రమేష్‌ ఎంత ప్రయత్నించినా కుదరలేదు. దీంతో రమేశ్‌ సాంకేతిక పరిజ్ఞానం సాయంతో సమాధానాలు చేరవేసేలా.. ఏడుగురితో ఒక్కొక్కరి నుంచి రూ.20-30 లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. ముందు మైక్రోఫోన్‌ వంటి ఎలక్ట్రాన్రిక్‌ డివైజ్‌లు వారికిచ్చాడు. అభ్యర్థులు వాటిని బెల్టులో భద్రపర్చుకొని.. పరీక్ష హాలులోకి చేరారు. ఎగ్జామినర్‌ సాయంతో ప్రశ్నపత్రాల ఫొటోలు తీసి.. రమేశ్‌ వాట్సాప్‌ నెంబర్‌కు చేరవేశారు. చాట్‌జీపీటీ- ద్వారా రమేశ్‌… వాటికి అనువైన సమాధానాలు సేకరించి వాట్సాప్‌ ఫోన్‌కాల్‌ ద్వారా పరీక్ష హాలులోని.. ఏడుగురు అభ్యర్థులకు చేరవేశాడు. ఈ వ్యవహారంలో… డీఈ రమేష్‌తో పాటు- ఎలక్ట్రాన్రిక్‌ డివైజ్‌ ద్వారా పరీక్ష రాసిన ప్రశాంత్‌, నరేష్‌, మహేశ్‌, శ్రీనివాస్‌లను అధికారులు అరెస్ట్‌ చేశారు. మరోవైపు.. లీకేజీపై సిట్‌ తుది నివేదిక వచ్చిన తర్వాతే… పరీక్షలు పూర్తైన 3 ఉద్యోగ నోటిఫికేషన్ల ఫలితాలు విడు దల చేయాలని టీ-ఎస్‌పీఎస్సీ నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో పూర్తి వివరాలు వెల్లడయ్యే వరకు వేచిచూడాలని టీఎస్‌పీఎస్సీ భావిస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement