Tuesday, November 19, 2024

భోగి మంట‌ల్లో జీవో నెంబ‌ర్ 1 ద‌హ‌నం… చెత్త జీవోలు తెస్తున్న ప్రభుత్వంపై పోరు ఆగదు : టీడీపీ అధినేత చంద్ర‌బాబు

తిరుపతి సిటీ : సైకో సీఎం పోవాలి సైకిల్ రావాలి, చెత్త జీవోలు తెస్తున్న ప్రభుత్వం పై పోరు ఆగదని టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. శనివారం నారావారిపల్లెలో భోగి పండుగ సందర్భంగా భోగి మంటలు వేస్తూ జీవో నెంబర్ ఒకటిని మంటల్లో వేశారు. అనంతరం ఆయన ఏర్పాటు చేసిన సమావేశంలో చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ఎన్టీఆర్ స్థాపించిన టిడిపి ఎప్పటికీ ప్రజల గుండెల్లో ఉంటుందన్నారు. ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు ఘనంగా జరుపుకుంటామన్నారు. తెలుగు జాతికి ఎన్టీఆర్ వరం అని తెలియజేశారు. ప్రపంచ వ్యాప్తంగా తెలుగువారు టెక్నాలజీలో ఎంతో ప్రగతి సాధించారని గుర్తు చేశారు. నేటి యువత పిల్లలను కన్నడం పై దృష్టి సారించాలని. డిజిటల్ ప్రపంచంలో సెల్ లేకుండా ఒక నిమిషం ఉండలేని పరిస్థితి ఉందన్నారు. నేను మొదట 20 20 విజన్ అంటే అందరూ నవ్వేరని గుర్తు చేశారు. 2047 విజన్ దేశ సత్వంత దినోత్సవ ము ప్రపంచదేశం లోఅగ్రభాగాన ఉంటుందని ఈరోజు కోసం బతుకుతారని మరికొందరు రేపటి కోసం బతుకుతార న్నారు. దేశం అగ్రస్థానంలో ఉంటే తెలుగువారు అందరూ అగ్రభాగాన ఉంటారన్నారు.

నాలెడ్జి ఎకానమీ ని ఎంతగానో ప్రోత్సహించాలన్నారు. అలాగే ప్రజా వేదిక కూల్చివేతతో ప్రారంభించిన విధ్వంసం మూడున్నర ఏండ్లుగా కొనసాగుతున్నదన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని పనుల భారం ప్రజలపై ప్రభుత్వం వేసిందన్నారు. రాష్ట్రంలో వ్యవస్థలని నాశనం చేశారన్నారు. సంక్షేమాన్ని సీఎం జగన్మోహన్ రెడ్డి నిర్వీర్యం చేశారన్నారు. నేడు ఏ కానుకలు పేదలకు అందడం లేదని, పండగ రోజు , ఆర్టీసీ బాదుడే, బాదుడురూ. 300 కోట్ల రూపాయలు ప్రజలపై భారం మోపడం జరిగిందన్నారు. ఎప్పుడూ తెలుగుదేశం పార్టీ ప్రజాహితం కోసం పాటుపడుతుందన్నారు. గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోఉన్నప్పుడు జన్మభూమి కార్యక్రమంతో ఎన్.ఆర్.ఐ.లను సొంత గ్రామాలకు రప్పించిన ఘనత తెలుగుదేశం పార్టీకే దక్కిందన్నారు. 23 ఏళ్ల కిందట భువనేశ్వరి సూచనతో నారావారిపల్లెలో పండగ జరుపుకుంటున్నామని గుర్తు చేశారు. నేడు సైకో పాలనలో ప్రజలు పల్లెలకు రావాలంటే భయపడుతున్నారన్నారు. సైకో ప్రభుత్వం పోవాలనే ఇదేం కర్మ రాష్ట్రానికి ప్రజలు బాధపడుతున్నారు. సైకో ప్రభుత్వం అన్ని వ్యవస్థలను నాశనం చేసిందన్నారు. 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఏ తప్పు చేయలేదని. టెర్రరిస్టులు, గుండాలపై పోరాడి నాపై సైకో ప్రభుత్వం కేసులు పెడుతుందని విమర్శించారు. ప్రజలను కలవనీయకుండా ప్రభుత్వం అనేక రకాల జీవోలను తెచ్చి ఇబ్బందులకు గురి చేయడం కాకుండా తప్పుడు కేసులు పెడుతున్నదని పేర్కొన్నారు. తన బాధ్యతగా ప్రజల కోసం పోరాడుతూ ఉంటే కందుకూరులో పోలీస్ వ్యవస్థ నిర్వీర్యం అయిపోయిందని గుర్తు చేశారు. తాను కుప్పంకు వెళితే జీవో నెంబర్ ఒకటి తీసుకువచ్చి అడ్డుకోవడం జరిగిందన్నారు. సైతాన్ సీఎం మరోసారి ముఖ్యమంత్రి అవ్వాలని చూస్తున్నారని అది జరగదని. దానికి తోడు అవినీతి పెరిగిపోయిందన్నారు. బీసీలకు పూర్వ వైభవం టిడిపి తీసుకువస్తుందని తెలియజేశారు. ఎస్సీల పరిస్థితి దారుణంగా ఉందని 27 పథకాలు ఎస్సీలకు రద్దు చేసిన ఘనత వైఎస్ఆర్సిపి ప్రభుత్వానికి దక్కిందన్నారు. భవిష్యత్తులో రెండు కులాలు ఉంటాయని అవి ధనికులు. పేద కులాలే అన్నారు. ఏపీ బ్రాండ్ ను సైకో సీఎం చెడగొడుతున్నారు అన్నారు. ఇసుక దొరకనీకుండా వైసీపీ నేతలే అమ్ముకుంటున్నారన్నారు. దొంగ బ్రాండ్ తో సీఎం జగన్మోహన్ రెడ్డి మద్యం పేరిట దోచుకుంటున్నారన్నారు. ప్రశ్నిస్తే పోలీసులతో కొట్టిస్తున్నారన్నారు.

మంత్రి పెద్దిరెడ్డి కి చంద్రబాబు వార్నింగ్
ఇప్పటివరకు తన మంచితనాన్ని చూశారు రేపు నా కఠినత్వం చూస్తారని తెలియజేశారు. కేసులు పెట్టి టిడిపి నేతలను మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వేధిస్తున్నారని, పండగ పూట కూడా వారిని జైల్లో పెట్టారన్నారు. పెద్దిరెడ్డి అరాచకాలను పెద్దిరెడ్డి హత్య రాజకీయాలను చూసి చూడనట్లు వదిలేస్తే రెచ్చిపోతున్నాడు అన్నారు. మంత్రి పెద్దరెడ్డిని సైకో సీఎం కూడా కాపాడలేరని తెలియజేశారు. కులాల మధ్య సీఎం చిచ్చు పెడుతున్నారన్నారు. టీటీడీలో భక్తుల మనోభావాలు దెబ్బతీస్తున్నారు. వెంకటేశ్వర స్వామి సన్నిధిలో అక్రమాలకు పాల్పడితే ఈ జన్మలోనే వారికి శిక్ష అనుభవిస్తారన్నారు. గతంలో తాను అన్నదానం, ప్రాణదానం, ట్రస్టులను ఏర్పాటు చేయడం జరిగిందని గుర్తు చేశారు. నాకోసం కాదు మీ పిల్లల భవిష్యత్తు కోసం ఆలోచించండి. ఈ ప్రభుత్వంపై ఈ పండగల్లో ప్రజల్లో సుదీర్ఘంగా చర్చించాలని, ఈ ప్రభుత్వానికి చరమగీతం పాడేందుకు అందరూ సైనికులు లాగా పనిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. మొన్న పవన్ కళ్యాణ్ శ్రీకాకుళంలో మాట్లాడితే సీఎం సైకో బ్యాచ్ రేస్ కుక్కల్లాగా మొరుగుతున్నాయి అన్నారు. బూతుల పంచాంగం మీకే కాదు మాకు తెలుసు.. మాకు సభ్యత్వం సంస్కారం ఉందన్నారు. ఏడాది తర్వాత సైకో బ్యాచ్ ప్రపంచంలో ఎక్కడ ఉన్నా పట్టుకోస్తామన్నారు. ప్రజలు కేసులకు భయపడితే భవిష్యత్తు ఉండదన్నారు. వ్యవసాయ పంప్ సీట్లకు విద్యుత్ మీటర్లు పెట్టేందుకు వస్తే ఎదిరించండి అన్నారు. సీఎం జగన్ రాష్ట్ర మీ జాగీరు కాదని. పోలీసులు మీకు రక్షణ ఉంటే ఐదు కోట్ల మంది అండగా నాకు ఉండారన్నారు. రాష్ట్రానికి పూర్వ‌ వైభవం కోసం సైకో సీఎం పోవాలని ఐదు కోట్ల మంది ప్రజలు సంకల్పం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి నూతన కాలువ అమర్నాథరెడ్డి, పార్లమెంట్ అధ్యక్షుడు నరసింహ యాదవ్, జిల్లా అధ్యక్షుడు పులి పత్తినానిచ రాష్ట్ర మీడియా కోఆర్డినేటర్ శ్రీధర్ వర్మ, తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవి నాయుడు, నియోజకవర్గ ఇన్ చార్జిలు పాల్గొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement