Friday, November 22, 2024

భాష‌తో ప‌నిలేదు – మ‌న సంస్కృతి భార‌తీయ‌మే – ప్ర‌ధాని మోడీ

భాష ఏదైనా సరే మన సంస్కృతి భారతీయమే అన్నారు భార‌త ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ .సమగ్రత .. సాంస్కృతిక వైవిధ్యం భారత దేశం బ‌ల‌మ‌ని, తాము ‘వసుధైవ కుటుంబం’-ఒకే ప్రపంచాన్ని విశ్వసిస్తామని ప్రధాని మోడీ తెలిపారు.భారతదేశ విస్తారమైన వైవిధ్యం కారణంగా.. ప్రజలు వేర్వేరు ఆహార ఎంపికలు, భాషలను కలిగి ఉండవచ్చు, కానీ భారతీయులంతా ఒకే సంస్కృతిని కలిగి ఉంటారని ఆయన పేర్కొన్నారు. దేశాన్ని రక్షించడానికి, తాము కలిసి నిలబడతామన్నారు. మూడు దేశాల యూరప్ పర్యటనలో భాగంగా రెండో విడతలో భాగంగా డెన్మార్క్‌కు చేరుకున్న ప్రధాని మోడీ, నేడు భారతదేశం ఏదైతే సాధిస్తుందో.. అది మానవాళిలో ఐదవ వంతు సాధించిన విజయమని అన్నారు. తన ప్రసంగంలో వాతావరణ మార్పు, పర్యావరణం, గ్రీన్ స్ట్రాటజిక్ పార్టనర్‌షిప్ గురించి కూడా మాట్లాడారు. వాతావరణ మార్పులను పరిష్కరించడానికి లైఫ్- లైఫ్ స్టైల్ ఫర్ ఎన్విరాన్‌మెంట్‌పై దృష్టి పెట్టాలన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement