రెజ్లింగ్ ఫెడరేషన్ చీఫ్ బ్రజ్‌భూషణ్‌పై వచ్చిన లైంగిక దాడి ఆరోపణలపై నిష్పక్షపాతంగా విచారణ జరిపించాలని మంత్రి కేటీఆర్ అన్నారు. వారికి న్యాయం జరిగేదాకా వారికి సపోర్ట్‌గా నిలబడాలని క్రీడాకారులు, యువతీ, యువకులకు పిలుపునిచ్చారు. ఇవ్వాల (శుక్రవారం) రాత్రి ఓ ట్వీట్‌లో మంత్రి కేటీఆర్ ఈ విషయాన్ని వెల్లడిచేస్తూ.. ‘‘ఈ ఒలింపిక్ ఛాంపియన్‌లు మన దేశానికి కీర్తిని తీసుకొచ్చినప్పుడు మనం సంబరాలు చేసుకున్నాం. ఇప్పుడు న్యాయం కోసం పోరాడుతున్నప్పుడు వారితో పాటు నిలబడి మన సంఘీభావాన్ని తెలియజేద్దాం”అంటూ ట్వీట్ చేశౄరు. రెజ్లింగ్ ఫెడరేషన్ చీఫ్‌పై వచ్చిన తీవ్రమైన లైంగిక వేధింపుల ఆరోపణలపై నిష్పక్షపాతంగా విచారణ జరిపి న్యాయం చేయాలని, అంతదాకా వారికి తెలంగాణ సపోర్టుగా నిలుస్తుందని, తన మద్దతు ఉంటుందని మంత్రి కేటీఆర్ తెలిపారు.
ఇది కూడా చదవండి : Shame | రెజ్లింగ్ ఫెడరేషన్ చీఫ్ బ్రిజ్‌భూషణ్‌పై లైంగిక వేధింపుల కేసు నమోదు.. సుప్రీం ఆదేశాలు