గంజాయిని పూర్తిస్థాయిలో నియంత్రించి గంజాయి రహిత కమిషనరేట్ గా రామగుండం ను తీర్చిదిద్దుతామని పోలీస్ కమిషనర్ చంద్రశేఖరరెడ్డి పేర్కొన్నారు. బుధవారం బసంత్ నగర్ పోలీస్ స్టేషన్ లో గంజాయి నియంత్రణ కోసం ముద్రించిన గోడ పత్రికను ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ మత్తు పదార్థాల వాడకం వల్ల యువత బంగారు భవిష్యత్తు బుగ్గిపాలవుతుందని, వీటి నియంత్రణ కోసం కఠిన చర్యలు తీసుకుంటున్నామన్నారు.
పోలీస్ కమిషనరేట్ పరిధిలోని రెండు జిల్లాల్లో ప్రజాప్రతినిధులకు, యువకులకు, విద్యార్థులకు గంజాయి వాడకం వల్ల జరిగే నష్టాల తోపాటు నియంత్రణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై త్వరలోనే అవగాహన సదస్సులు నిర్వహిస్తామన్నారు. కార్యక్రమంలో డిసిపి రవీందర్, ఎసిపీ సారంగపాణి, సిఐలు ప్రదీప్ కుమార్, ఇంద్రసేనారెడ్డి, ఎస్ఐలు మహేందర్, రాజేష్ తో పాటు సిబ్బంది పాల్గొన్నారు.