Saturday, November 23, 2024

Maoist: గిట్టుబాటు ధ‌ర‌కోసం పోరాడుదాం రండి.. మావోయిస్టుల పిలుపు

మిర్చి రైతుల‌కు గిట్టుబాటు క‌ల్పించాల‌ని.. దీనికోసం రైతులంతా ఏక‌మై పోరాటం చేయాని పిలుపునిచ్చారు మావోయిస్టు నేత వెంక‌టేశ్‌. ఈ మేర‌కు ఇవ్వాల సీపీఐ మావోయిస్టు కార్య‌ద‌ర్శి వెంక‌టేశ్ పేరుతో లేఖ విడుద‌ల చేశారు. లేఖ‌లో ఏం రాశారంటే..

ప్రభుత్వం బహుళజాతి సంస్థలకు అమ్ముడుపోయి రైతులకు ఎలాంటి సబ్సిడీలు ఇవ్వకపోవడంతో రైతులంతా ప్రైవేట్ వ్యాపారుల వద్ద, అడ్డీ దారుల వద్ద అధిక వడ్డీకి అప్పులు తెస్తున్నారు. అంతేకాకుండా ఫర్టిలైజర్ షాపుల వద్ద నాసిరకం మిర్చి విత్తనాలు కొనడంతో అవి సరిగా మొలకెత్తకపోవడంతో పంటలు సరిగా రాకపోవడం, క్రిమిసంహారక మందులు అధిక ధరలకు కొనడం, అధిక వడ్డీలు చెల్లించడం, దీనికి తోడు ప్రకృతి వైపరీత్యాల వల్ల, అకాల వర్షాలు సంభవించడం వల్ల, పండిన పంటను నష్టపోవడంతో పెట్టిన పెట్టుబడి రాకపోవడంతో కొంత మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.

ప్రభుత్వం, మార్కెట్ పాలకవర్గం, వ్యాపారస్తులతో కుమ్మకై ఒకటి, రెండులాట్లకు మాత్రమే 17,200 రూ. ధర కల్పించి మిగతా అన్ని లాట్లకు నాణ్యత లేదని డొంకతిరుగుడు సాకులు చెప్పి కావాలని మిర్చి ధర తగ్గించడంతో రైతులంతా ఆగ్రహించి, మార్కెట్ కార్యాలయంలో ఫర్నీచర్ ను ధ్వంసం చేయడం లాంటి పోరాట రూపం తీసుకోవడంతో మార్కెట్ పాలకవర్గం, ప్రభుత్వ అధికారులు, కలెక్టర్, రాజకీయ నాయకులు వచ్చి నాణ్యతను ట్టి మిర్చి ధర నిర్ణయించవలసి వస్తుందని, అకాల వర్షాల వల్ల నాణ్యత లేదని, ఎక్స్పర్టు లేదని, ఎక్స్పర్టు ఉంటే ధర కల్పించేవాళ్లమని అయినప్పటికి రైతులకు సరైన ధర నిర్ణయించి కొనుగోలు చేస్తామని ఉచిత సలహా ఇచ్చారు.

మరోపక్క గిట్టుబాటు ధర రాకుంటే కోర్టు స్టోరేజ్ లో పెట్టుకోవాలని దానిపై 70% రైతుబంధు పొందవచ్చని సలహాలు ఇచ్చి రైతుల ఆగ్రహాన్ని చల్లార్చే ప్రయత్నం చేసారు. ఇది పాలకవర్గాలకు ఉచిత సలహాలు ఇచ్చి, మభ్యపెట్టి మోసగించి పోరాటాలను చల్లార్చడం వారికి వెన్నతో పెట్టిన విద్యే. ప్రకృతి వైపరీత్యాల వల్ల పంటకు చీడపీడలు వచ్చి పంటలు నష్టపోవడం, అకాల వర్షాల వల్ల పంటను నష్టపోతున్నారు. పెట్టిన పెట్టుబడి రాకపోవడంతో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. దీనికంతటికీ ప్రభుత్వమే కారణం కాబట్టి నష్టపోయిన పంటకు నష్ట పరిహారం ఇవ్వాలి. పండిన పంటను సరైన ధరకు కొనుగోలు చేసే బాధ్యత ప్రభుత్వనిదే. కాబట్టి సరైన ధరకు ప్రభుత్వం కొనుగోలు చేసేంత వరకు రైతులంత మొక్కవోని ధైర్యంతో ఐక్యంగా పోరాడాలని పిలుపునిస్తున్నాం. అని పేర్కొన్నారు మావోయిస్టు నేత వెంక‌టేశ్‌.

Advertisement

తాజా వార్తలు

Advertisement