లీడర్ల పిల్లలపై వ్యతిరేక వర్గాలు చేస్తున్న విమర్శలు, ఆరోపణలపై టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ సీరియస్ అయ్యారు. ఇట్లాంటి సంస్కృతి మన దగ్గర వద్దని ఆయన సోమవారం ఓ కీలక సూచన చేశారు. రాజకీయ విమర్శల నుంచి లీడర్ల పిల్లలను మినహాయిద్దామని పిలుపునిచ్చారు. పిల్లలను ఆసరాగా చేసుకుని లీడర్లను టార్గెట్ చేయడం ఎంతమాత్రం ఆహ్వానించదగ్గ పరిణామం కాదన్నారు కేటీఆర్. ఈమేరకు సోషల్ మీడియా వేదికగా ఓ ట్వీట్ పోస్ట్ చేశారు.
ఇక మీదట పిల్లలను రాజకీయ రొంపిలోకి లాగే దుష్ట సంస్కృతికి చరమ గీతం పాడుదామని కేటీఆర్ తన సొంత పార్టీ నేతలకు పిలుపునిచ్చారు. టీఆర్ఎస్ నేతలు, పార్టీ సోషల్ మీడియా కార్యకర్తలు ఈ సంస్కృతికి స్వస్తి చెప్పాలని సూచించారు. వర్గ శత్రువులను వారి సిద్ధాంతాలు, నిర్ణయాలు, పని తీరు ఆధారంగానే విమర్శలు చేద్దామని పిలుపునిచ్చారు.