Friday, November 22, 2024

Big Breaking: సోషల్​ మీడియా కోరలు విరిచేద్దాం.. జపాన్​ పార్లమెంట్​లో బిల్లు.. అసభ్య పోస్టులకు భారీ ఫైన్​!

సోషల్ మీడియా అంటేనే ఇష్టమున్నట్టు భావ వ్యక్తీకరణ చేయడం.. అయితే దాని వల్ల మంచి ఎంత ఉందో, చెడు దానికంటే రెట్టింపు స్థాయిలో ఉంది. దీంతో చాలామంది ప్రాణాలు తీసుకుంటున్న సిచ్యుయేషన్​ ఉంది. సోషల్​ మీడియాలో వచ్చే పనికిమాలిన పోస్టులు, అసభ్యకరమైన వాటితో అవమానాలు భరించలేక ఎంతోమంది ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. విలువైన తమజీవితాలను పోగొట్టుకుని కన్నవారికి కడుపుకోత మిగులుస్తున్నారు.

అయితే.. ఇట్లాంటి సోషల్​ మీడియా కోరలు విరిచేందుకు జపాన్​ పార్లమెంట్​ సన్నద్ధమైంది. సోషల్​ మీడియాలో నైతికత విలువలు పాటించేలా ఇవ్వాల బిల్​ పాస్​ చేశారు. ఈ రూల్స్​ మీరిన వారికి పెద్ద ఎత్తున ఫైన్​ వేయబోతున్నట్టు తెలుస్తోంది. అయితే. దీనిపై తెలంగాణ యంగ్​ లీడర్​, టీఆర్​ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్​ కె. తారాక రామారావు ట్విట్టర్​లో పోస్టు చేశారు. ‘‘ఆన్‌లైన్ అవమానాలకు కఠినమైన జరిమానాలు విధించే బిల్లును ఆమోదించిన జపాన్ పార్లమెంట్‌కు అభినందనలు’’ అని రీట్వీట్​ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement