Tuesday, November 26, 2024

ఒంటరిగానే పోటీ, పొత్తులు ఉండవ్‌.. భీమ్‌ ఆర్మీ చీఫ్‌ చంద్రశేఖర్‌ ఆజాద్‌

లక్నో : ఉత్తర్‌ప్రదేశ్‌ అసెంబ్లిd ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తామని జై భీం ఆర్మీ చీఫ్‌, ఆజాద్‌ సమాజ్‌ పార్టీ వ్యవస్థాపకుడు చంద్రశేఖర్‌ ఆజాద్‌ రావన్‌ తేల్చి చెప్పారు. అఖిలేష్‌ యాదవ్‌తో కలిసి పోటీ చేస్తారని అందరూ భావించారు. అయితే సమాజ్‌వాదీ పార్టీతో పొత్తు కుదరకపోవడంతో.. ఒంటరిగా బరిలోకి దిగేందుకు నిర్ణయించినట్టు చంద్రశేఖర్‌ ప్రకటించారు. అఖిలేష్‌ యాదవ్‌ పేరును ప్రస్తావించకుండానే.. తాము అధికార, ప్రతిపక్షానికి గట్టి పోటీ ఇస్తామన్నారు. 33 స్థానాల్లో ఒంటరిగానే పోటీ చేసేందుకు నిర్ణయించామన్నారు.

మరికొన్ని స్థానాల్లో పోటీ చేసే అంశంపై చర్చలు కొనసాగుతున్నాయని తెలిపారు. 30 శాతం సీట్లు దళితులకు, 42 శాతం సీట్లు ఓబీసీలకు, 5 శాతం ఎస్‌టీ సభ్యులకు, మిగిలినవి బడుగు బలహీన వర్గాల వారికి ఇచ్చామన్నారు. కొన్ని రోజుల క్రితం అఖిలేష్‌ యాదవ్‌తో రావణ్‌ భేటీ అయ్యారు. కలిసి పోటీ చేస్తారని అందరూ భావించారు. అయితే విషయం కొలిక్కి రాకపోవడంతో.. సోమవారం ఆజాద్‌నుద్దేశిస్తూ.. అఖిలేష్‌ విమర్శలు గుప్పించారు. మంగళవారం రావణ్‌ ఒంటరి పోరుకు సిద్ధం అయ్యారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement