Thursday, November 21, 2024

బిడ్డ‌ని కాపాడుకునేందుకు చిరుత వెనుక ప‌రిగెత్తిన త‌ల్లి .. త‌ర్వాత ఏం జ‌రిగింది ..!

ఓ చిరుత‌పులి చిన్నారిపై దాడి చేసింది. అయితే ఈ ఘ‌ట‌న‌లో చిన్నారిని మాత్రం లాక్కెళ్ల‌లేక‌పోయింది. ఈ సంఘ‌ట‌న మ‌ధ్య‌ప్ర‌దేశ్ లోని సిద్ధి జిల్లాలో చోటు చేసుకుంది. ఈ ఘ‌ట‌న‌లో చిన్నారి చెంప‌, వెన్ను, ఒక కంటిపై తీవ్ర గాయాలు అయ్యాయి. దాంతో ఆ చిన్నారిని చికిత్స కోసం కుస్మి ఆసుపత్రికి త‌ర‌లించారు. బారి ఝ‌రియా గ్రామంలో కిర‌ణ్ బైగా అనే మ‌హిళ త‌న పిల్ల‌ల‌తో క‌లిసి చ‌లి మంట ద‌గ్గ‌ర కూర్చుని ఉండ‌గా చిరుత‌పులి దాడి చేసింది. దాంతో ఎనిమిదేళ్ల కొడుకు త‌ల‌ని నోటితో ప‌ట్టుకుంది. కొడుకు తల మొత్తం ఆ చిరుత పులి నోట్లో ఉంది. అది చిన్నారిని లాక్కెళ్లటానికి ప్రయత్నిస్తోంది. చిరుతను చూసిన మహిళ తొలుత భయపడిపోయింది. తన బిడ్డ ప్రాణంతో ఉండటంతో ధైర్యం తెచ్చుకుంది.

వెంటనే తేరుకున్న మహిళ చిరుతపులి వెంట పడింది. ఈ క్రమంలో కిరణ్ దాదాపు కిలోమీటరు మేర చిరుతపులిని వెంబడించి తన బిడ్డను కాపాడుకోగలిగింది. ఫారెస్ట్ ఆఫీసర్ టైగర్ రిజర్వ్ తంసర్ సిధి అసిమ్ భూరియా మాట్లాడుతూ.. చిరుతపులి దాడిలో పిల్లలకు వెన్ను, చెంపలు, కళ్లపై తీవ్ర గాయాలయ్యాయని తెలిపారు. ప్రస్తుతం వారు కుస్మి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. గాయపడిన చిన్నారి చికిత్సకు అయ్యే ఖర్చు మొత్తాన్ని అటవీశాఖ భరిస్తుందని భూరియా తెలిపారు. దీంతో పాటు స్థానిక జిల్లా యంత్రాంగం కూడా బాధిత కుటుంబానికి సహాయాన్ని అందించింది.మొత్తానికి త‌న బిడ్డ ప్రాణాల‌కోసం చిరుత వెన‌క ప‌రిగెత్తిన త‌ల్లి ధైర్యానికి అంద‌రూ స‌లామ్ కొట్టారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement