Friday, November 22, 2024

ఐర్లాండ్ ప్రధాన మంత్రిగా భారత సంతతి వ్యక్తి.. రెండోసారి ఎన్నికయిన లియో వరద్కర్

ఇప్పటికే అమెరికా ఉపాధ్యక్షురాలిగా కమలాహారిస్ ..ఎన్నికయ్యారు..కాగా బ్రిటన్ ప్రధానిగా రిషి సునాక్ సత్తా చాటారు. ఇలా భారతీయులు ప్రపంచ దేశాల రాజకీయాల్లో సత్తా చాటుతున్నారు. ఇంగ్లండ్ పొరుగునే ఉన్న ఐర్లాండ్ ప్రధాన మంత్రిగా భారత సంతతి వ్యక్తి లియో వరద్కర్ రెండోసారి ఎన్నికయ్యారు. 43 ఏళ్ల లియో ఇది వరకే ఒక పర్యాయం ఐర్లాండ్ ను పాలించారు. ఇప్పటికీ ఐర్లాండ్ ను పాలిస్తున్న పిన్న వయస్కుడిగా ఉన్నారు.

38 ఏళ్ల వయసులో 2017లో ఆయన తొలిసారి ప్రధాన మంత్రి అయ్యారు. 2022లో ఐర్లాండ్ లోని ప్రధాన పార్టీలైన ఫిల్ గేన్, మార్టిన్ ఫియన్నా ఫెయిల్ మధ్య కుదరిన ఒప్పందం మేరకు లియోకు మరోసారి అవకాశం లభించింది. కాగా, లియోకు భారత ప్రధాన మంత్రి అభినందనలు తెలిపారు. ‘రెండోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన లియోకు అభినందనలు. ఐర్లాండ్ తో మా చారిత్రక సంబంధాలు, రాజ్యాంగ విలువలను పంచుకోవడం, బహుముఖ సహకారానికి మేము చాలా ప్రాముఖ్యత ఇస్తాము’ అని ట్వీట్ చేశారు. ఇరు దేశాల అర్థిక వ్యవస్థలను మరింత బలోపేతం చేసుకునేందుకు ఆయనతో కలిసి పని చేయడానికి ఎదురు చూస్తున్నానని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement