చిట్ ఫండ్ పేరుతో ప్రముఖులను మోసం చేసిన కేసులో అరెస్టయి పోలీస్ కస్టడీలో ఉన్న శిల్పా చౌదరి నోట కొత్త కొత్త అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆమెను తన ఇంటికి తీసుకెళ్లి లాకర్లు తెరిపించిన పోలీసులు అందులోంచి పలు కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది. ఈ సందర్భంగా తానెవరినీ మోసం చేయలేదని, బ్లాక్ మనీని వైట్ మనీ చేయమని కొందరు తనకు డబ్బులిచ్చారని శిల్పా చౌదరి చెప్పినట్టు సమాచారం..
తనకు కొందరు డబ్బు అప్పుగా ఇచ్చారని ఆ డబ్బుని సినిమాహాళ్లు, ఆస్పత్రుల్లో పెట్టుబడులు పెట్టినట్లు శిల్పా చౌదరి చెప్పింది. తన దగ్గర అప్పు తీసుకున్న వారు తిరిగి ఇవ్వలేదని అందుకే తాను చెల్లించాల్సిన వారికి సకాలంలో ఇవ్వలేకపోయానని శిల్పా చెప్పినట్లు సమాచారం.