Monday, November 18, 2024

Lemon: సామాన్యుడిని పిండేస్తున్న నిమ్మ.. ధర ఎంతో తెలుసా?

వేసవిలో ఎండల తీవ్రత పెరుగుతున్న కొద్దీ నిత్యావసరాల ధరలూ కూడా సామాన్యుడికి దడ పుట్టిస్తున్నాయి. ఇప్పటికే పెట్రోల్, డిజీల్, గ్యాస్ ధరలతోపాటు వంటింట్లో ఉపయోగించే నునె తదితర రేట్లు కూడా భారీగా పెరిగిగాయి. తాజాగా వేసవిలో తరచూ వాడే నిమ్మకాయల ధరలూ కూడా ఆకాశాన్నంటాయి. దేశంలో కనీవినీ ఎరుగని స్థాయిలో నిమ్మకాయల ధరలు పెరిగాయి. గుజరాత్ లోని రాజ్ కోట్ లో కిలో నిమ్మ ధర ఏకంగా రూ.200 పలికింది. డిమాండ్ కు తగ్గినట్టుగా సరఫరా లేకపోవడంతో ధరలు భారీగా పెరిగిపోయాయి. గత సీజన్ లో రూ.50-60లుగా ఉన్న నిమ్మ ధరలు ఇప్పుడు ఏకంగా రూ.200 పలకడంతో వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు.

ఏపీలోని ప్రకాశం జిల్లా కనిగిరిలో గత నెలలో మొదటి రకం నిమ్మ కిలో ధర రూ.60 నుంచి ఏకంగా 90-100కి పెరిగింది. రెండో రకమైతే 80 నుంచి 90 వరకు పలికింది. జిల్లాలో కొన్ని చోట్ల ఒక్కో నిమ్మకాయను రూ.5 నుంచి 7లకు విక్రయిస్తున్నారు. ప్రజలు తమ డైట్‌లో నిమ్మకాయల్ని విరివిగా వాడుతుంటారు. దీంట్లో విటమిన్‌ ‘సి’ పుష్కలంగా ఉండటంతో పాటు జీర్ణక్రియ సరిగా పనిచేసేలా, శరీరాన్ని హైడ్రేటడ్‌గా ఉంచడంలో కీలకంగా పనిచేస్తుంది. వేసవిలో నిమ్మకు మండి డిమాండ్ ఉంటుంది. అయితే, వినియోగం పెరగడం, సరఫరాలో కొరత కారణంగా నిమ్మ ధరలు ఆకాశాన్నంటుతున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement