Friday, November 22, 2024

ప్రజల భక్తి, విశ్వాసాలపై దాడిచేసిన చినజీయర్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి: రేవంత్‌రెడ్డి

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: వనదేవతలైన సమ్మక్క- సారలమ్మలు తెలంగాణ పౌరుషానికి, సంస్కృతికి ప్రతీక అని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అన్నారు. అలాంటి వారిని చినజీయర్‌ స్వామి అవమానించారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. యాదగిరిగుట్ట దేవాలయానికి ఆగమశాస్త్ర సలహాదారుడిగా ఉన్న చినజీయర్‌ను బాధ్యతల నుంచి వెంటనే తప్పించాలని రేవంత్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. ప్రజల భక్తి, విశ్వాసాలపై దాడి చేసినందున.. ఆయనపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు.

ఈ విషయంలో స్పందించి సరైన చర్యలు తీసుకోవాలని సీఎంవో కార్యాలయానికి ట్వీట్‌ చేశారు. చినజీయర్‌ స్వామి నిర్ణయించిన మూహుర్తం ప్రకారం మహా కుంభ సంప్రోక్షణకు ఏర్పాట్లు చేస్తున్నట్లు శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారి దేవాలయం విడుదల చేసిన ప్రెస్‌నోట్‌ విడుదల చేసింది. ఈ ప్రెస్‌ నోట్‌తో పాటు సీఎం కేసీఆర్‌, చినజీయర్‌ స్వామి ఫొటోలను ట్విట్టర్‌లో రేవంత్‌రెడ్డి పోస్ట్‌ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement