Thursday, November 21, 2024

హిజాబ్ వివాదంతో లెక్చ‌ర‌ర్ రాజీనామా – వైర‌ల్ గా చాందిని లెట‌ర్

హిజాబ్ వివాదం విద్యార్థుల నుండి ఉపాధ్యాయుల‌ని తాకింది. క‌ర్ణాట‌క‌లోని ఓ కాలేజ్ లెక్చ‌ర‌ర్ రాజీనామా చేస్తున్న‌ట్లు లేఖ రాశారు. దాంతో మరోసారి హిజాబ్ వివాదంపై చర్చకు ఆజ్యం పోసింది. తన ఆత్మాభిమానాన్ని పేర్కొంటూ ఆమె రాజీనామా లేఖను కాలేజీ యాజమాన్యానికి అందించారు. రాజీనామా లేఖలో ఆమె ఈ విధంగా పేర్కొన్నారు. ఇంగ్లీష్ సబ్జెక్ట్ బోధిస్తున్న తాను ఆ పొజిషన్‌కు రాజీనామా చేస్తున్నట్టు తెలిపారు. ఆ కాలేజీలో తాను మూడేళ్లుగా బోధిస్తున్నాన‌ని తెలిపారు. అప్పటి నుంచి తాను హిజాబ్ ధరించారని చెప్పారు. కానీ, తొలిసారిగా ఇప్పుడు కాలేజీ ప్రిన్సిపల్ తనను పిలిచి తాను హిజాబ్ ధరించరాదని డిమాండ్ చేశారన్నారు. మతాన్ని ఎంచుకునే హక్కు రాజ్యాంగం కల్పిస్తున్నదని, ఈ హక్కునూ ఎవరూ తిరస్కరించలేరని స్పష్టం చేశారు. హిజాబ్ ధరించాలని ఆదేశించిన కారణంగా తాను రాజీనామా చేస్తున్నట్టు తెలిపారు. ప్రిన్సిపల్ చర్యలను ఆమె ఖండిస్తున్నట్టు లేఖలో పేర్కొన్నారు. కర్ణాటకలో తుమకూరులోని జైన్ పీయూ కాలేజీలో లెక్చరర్ చాందిని ఆంగ్ల భాష బోధిస్తున్నారు. మూడేళ్లుగా ఆమె అక్కడ సేవలు అందిస్తున్నారు. కానీ, తొలిసారిగా ఆమెను హిజాబ్ తొలగించాలని ఆదేశించడంతో ఆమె ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆమె రాజీనామా లేఖ చర్చనీయాంశం అయింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement