లీజుకు పెద్ద పెద్ద భవనాలు,రెస్టారెంట్లు,ఇళ్ళు ఇలా పలు వాటిని ఇస్తుంటారని తెలిసిన విషయమే. మరి భార్యను కూడా లీజుకి ఇస్తారని మీకు తెలుసా..నిజమేనా అనుకుంటున్నారా..అక్షరాలా నిజమండీ..ఇది ఓ రకమైన సంప్రదాయం. భారతదేశంలో ఎన్నో సంప్రదాయాలు ఉన్నాయి..రాష్ట్రానికి, గ్రామానికో సంప్రదాయం ఉంటుంది. ఇప్పుడదే సంప్రదాయం మధ్యప్రదేశ్‌లోని శివపురి జిల్లాలో కొనసాగుతోంది. ఈ ఆచారం పేరు ధడిచా ప్రాథ. మధ్యప్రదేశ్‌లోని శివపురి జిల్లాలోని పలు ప్రాంతాల్లో ధడిచా ప్రాథ విపరీతంగా ఉంటుంది. బాగా డబ్బులు ఉన్నవాళ్లు, ఆస్తులు ఉన్నప్పటికీ భాగస్వామి దొరకని అగ్రవర్ణాల మగవారు.. ఇతరుల భార్యలను అద్దెకు తెచ్చుకుంటారు.
నెల రోజుల నుంచి ఏకంగా ఏడాది పాటు మరొకరి భార్యను అద్దెకు తీసుకుంటూ.. వారితో ఇంటి పనులతో పాటు, పడక సుఖం కూడా అనుభవిస్తారు. మొత్తానికి చెప్పాలంటే ఆ కుటుంబానికి ఆమె తాత్కాలిక కోడలిగా ఉంటూ ప్రతి ఒక్కరి బాగోగులు చూసుకోవాలి. పైగా సదరు వివాహిత భర్తలు ఇందుకు స్టాంపు పేపర్ల మీద సంతకాలు చేసి మరీ వ్యాపారం చేయడం గమనార్హం.ఒక వ్యాపారానికి భారీగా డిమాండ్ ఉంది అంటే అందులో మధ్యవర్తులే కీలకంగా వ్యవహరిస్తుంటారు. బడాబాబులతో పరిచయాలు చేసుకుంటూ మారుమూల గ్రామాల్లోని పేద ప్రజల కష్టాలను ఆసరాగా చేసుకుంటూ ఈ వ్యాపారం కొనసాగిస్తున్నారు. మరి అద్దెకు వెళ్లే మహిళల పరిస్థితి ఏంటని పలువురు సోషల్ వర్కర్స్ నిలదీస్తూనే ఉన్నా ఇటువంటి వ్యాపారాలు కొనసాగడం గమనార్హం.
ముఖ్యంగా గిరిజన కుటుంబాల్లో ఇటువంటి కార్యక్రమాలు కొనసాగుతున్నప్పటికీ.. ఇష్టం లేకపోయిన తప్పడం లేదని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నట్టు సమాచారం. అయినప్పటికీ ఏ ఒక్కరు కూడా పోలీసులకు ఫిర్యాదు చేయడానికి ముందుకు రావడంలేదని తెలుస్తోంది. ఇటీవల గుజరాత్‌లో కూడా ఇటువంటి ఘటన ఒకటి వెలుగుచూసింది. ఓ వ్యవసాయ కూలీ తన భార్యను నెల రోజులకు ధనవంతుడికి లీజుకు ఇవ్వగా.. తన కూలీ కంటే పది రెట్లు ఎక్కువగా ఆదాయం వస్తోందట.కొన్ని కుటుంబాల్లో అయితే భార్యలను రూ. 5 వందల కంటే తక్కువకు అద్దెకు ఇచ్చిన సంఘటనలు ఉంటే.. మరి కొన్ని కుటుంబాల్లో కూతుర్లను రూ. 50 వేలకు అప్పగిస్తున్నారు. ఏది ఏమైనా.. అక్కడి వారికి ధడిచా ప్రాథ ఆనవాయితీగా వస్తోంది.