గతకొంతకాలంగా నారోగ్యంతో బాధపడుతూ ముంబైలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు ప్రముఖ సంగీత దర్శకుడు బప్పిలహరి. కాగా ఆయన చికిత్స పొందుతూ ఆసుపత్రిలోనే తుదిశ్వాస విడిచారు. ఆయన వయసు 69ఏళ్లు. పశ్చిమ బెంగాల్‌లోని జల్పాయ్ గుడిలో జన్మించిన ఆయన ఎన్నో భాషల్లో పాటలు పాడారు. ముఖ్యంగా హీందీ చిత్రాలతో పాటు తెలుగులో కూడా పలు చిత్రాలకు బప్పీ లహిరి సంగీతం అందించారు. సింహాసనం, సామ్రాట్, స్టేట్‌రౌడి, గ్యాంగ్‌లీడర్ వంటి చిత్రాలకు సంగీతాన్ని అందించారు. తెలుగులో 50చిత్రాలకి పైగా సంగీత దర్శకత్వం వహించారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement