Saturday, November 23, 2024

అనారోగ్యంతో క‌న్నుమూసిన బెంగాల్ ప్ర‌ముఖ గాయ‌ని ‘సంధ్య‌ముఖ‌ర్జీ’

బెంగాల్ తో పాటు బాలీవుడ్ లో త‌న గానంతో మైమ‌ర‌పించారు బెంగాల్ గాయ‌ని సంధ్య ముఖ‌ర్జీ. అనారోగ్యంతో ఆమె క‌న్నుమూశారు. ఆమె వ‌య‌స్సు 90ఏళ్ళు. ఆనాటి తరం గాయనీమణుల్లో సంధ్య ముఖర్జీ స్టార్ సింగ‌ర్ గా వెలుగొందారు. బెంగాల్ సంగీత సాంమ్రాంజ్యం నుంచి వచ్చిన బర్మన్ లాంటి స్టార్ మ్యూజిక్ డైరెక్టర్లతో పాటు ,బాలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్లకు వేల పాటలు పాడారు . ఆమె మరణంతో బెంగాల్ చిత్ర పరిశ్రమతో పాటు బాలీవుడ్ లో కూడా విషాద ఛాయలు అలముకున్నాయి.

సధ్య ముఖర్జీ మరణంతో అటు బెంగాల్ తో పాటు ..ఇటు బాలీవుడ్ ప్రముఖులు సంతాపం ప్రకటిస్తున్నారు. రీసెంట్ గా 90 ఏళ్ల వయస్సులో సంధ్య ముఖర్జీకి పద్మశ్రీ ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. కాని బెంగాల్ నుంచి పద్మశ్రీతో పాటు ఇతర అవార్డ్ లను చాలామంది తిరస్కరించారు. అందులో సంధ్య ముఖర్జీ కూడా ఉన్నారు. ఈ వయస్సులో తనకు పద్మశ్రీ అవసరం లేదు అన్నారు. జూనియర్ ఆర్టిస్ట్ లకు పద్మశ్రీ తీసుకునే అర్హత ఉందని. తనకు ఆ అవార్డ్ అవసరం లేదని పద్మా అవార్డ్ ను తిరస్కరించి సంచలనం సృష్టించారామె.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement