హైదరాబాద్ లో వరద కష్టాలు సామాన్యులతోపాటు ప్రజాప్రతినిధులను కూడా ఇబ్బంది పడుతున్నాయి. గత రెండు రోజులుగా భాగ్యనగరంలో కుండపోతగా వర్షం కురుస్తోంది. నిన్న రాత్రి నుంచి ఏకధాటిగా కురిసిన భారీ వర్షంతో నగరంలోని లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. రోడ్లు, కాలనీలు చెరువులను తలపిస్తున్నాయి. వర్షాలకు ఎల్బీనగర్‌లోని గడ్డి అన్నారంలో వరద ఉధృతి నెలకొంది. పలు కాలనీల్లో ఇళ్లు పూర్తిగా నీటమునిగాయి. దీంతో కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఎల్బీనగర్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి గురువారం ఉదయం వరద ముంపుకు గురైన కాలనీలలో పర్యటించారు. హస్తినాపురం కాలనీకి వచ్చేసరికి ఆయన కారు వరద నీటిలో చిక్కుకుంది. ఎంత ప్రయత్రించినా కారు ముందుకు కదలలేదు. సెక్యూరిటీతో పాటు కలిసి ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి కూడా కారును తోశారు. దీంతో ఎమ్మెల్యే నడుచుకుంటూ వెళ్లారు. అనంతరం అతికష్టం మీద వరదలో చిక్కుకున్న కారు బయటకొచ్చింది.
ఇది కూడా చదవండి: తెలంగాణలో విస్తారంగా వర్షాలు