– డిజిటల్ మీడియా, ఆంధ్రప్రభ
కొద్ది రోజుల క్రితం సినీ నటి అమలాపాల్ మాజీ ప్రియుడు భవ్నీందర్ సింగ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. తనను మోసం చేసి బెదిరింపులకు గురిచేస్తున్నాడని తమిళనాడులోని విల్లుప్రురం జిల్లా క్రైం బ్రాంచ్ పోలీసులకు ఆమె ఫిర్యాదు చేసింది. ఈ కేసులో భవ్నీందర్ జైలులో ఉండగా.. అతని తరపున కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. 2017లోనే అమల, భవ్నీందర్ పెళ్లి చేసుకున్నారని ఆయన తరఫు న్యాయవాది కోర్టుకు ఆధారాలు సమర్పించారు.
అమలా పాల్, భవ్నీందర్ సింగ్‌ని పెళ్లి చేసుకున్నారా?
మార్చి 2020లో అమలా పాల్, భవ్నిందర్ సింగ్‌ని పెళ్లి చేసుకున్నారన్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే.. ఆ ఫొటోలను తర్వాత ఇంటర్నెట్ నుంచి తొలగించారు. ఇక్కడ సీన్ కట్ చేస్తే లేటెస్ట్గా 2022 లో భవ్నీందర్ సింగ్ తనను మోసం చేసి బెదిరించాడని అమలా పాల్ ఫిర్యాదు చేసింది. విడిపోయిన సమయంలో తనను వేధించారని కూడా ఆమె ఆరోపించింది. దీంతో పోలీసులు భవ్నీందర్ సింగ్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఇక.. తన బెయిల్ పిటిషన్‌లో 2017లోనే వారి వివాహానికి సంబంధించిన ఆధారాలను కోర్టుకు అందించారు. ఈ రుజువుల ఆధారంగా భవ్నీందర్ సింగ్‌కు కోర్టు షరతులు లేని బెయిల్ మంజూరు చేసింది.
కాగా, అమలాపాల్ విజయ్‌తో విడాకులు తీసుకున్న తర్వాత ఆమె పుదుచ్చేరికి వెళ్లింది. 2020లో గాయకుడు భవ్నిందర్ సింగ్‌తో ఆమె రిలేషన్‌షిప్‌లో ఉన్నట్లు కొన్ని ఆధారాలు బయటికి వచ్చాయి. సంప్రదాయ దుస్తుల్లో చూడముచ్చటగా ఉన్న ఈ జంటకు చెందిన కొన్ని ఫొటోలు వారి పెళ్లి గురించిన పుకార్లకు దారితీశాయి. అయితే.. ఈ వార్తలను తోసిపుచ్చిన అమల.. అది ఫొటోషూట్ మాత్రమేనని పేర్కొంది. ఇక.. అమలా పాల్ భవ్నీందర్‌తో తన సంబంధాన్ని తెంచుకున్నట్లు చెప్పింది.