కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ నటించిన ఆఖరి చిత్రం జేమ్స్ ..నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కాగా ఈ చిత్రంలో ప్రియా ఆనంద్ హీరోయిన్ గా నటించింది. కిశోర్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై కిశోర్ పత్తికొండ దీన్ని నిర్మించారు. ఇందులో శ్రీకాంత్ కూడా కీలక పాత్రను చేశాడు. చరణ్ రాజ్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. ఈ మూవీలో పునీత్ పాత్రకు అన్న శివరాజ్‌కుమార్ డబ్బింగ్ చెప్పిన విషయం తెలిసిందే. అంచనాలను పెంచిన అప్డేట్స్ పునీత్ రాజ్‌కుమార్ నటించిన చివరి చిత్రం కావడంతో కన్నడ చిత్ర పరిశ్రమలో ‘జేమ్స్’ మూవీ ప్రత్యేకతను సంతరించుకుంది. అందుకే దీని విడుదల సమయంలో చాలా చిత్రాల రిలీజ్‌ను ఆపేశారు. . ‘జేమ్స్’ మూవీకి ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో బిజినెస్ జరిగినట్లు శాండిల్‌వుడ్ మీడియా రిపోర్టుల ఆధారంగా తెలుస్తోంది.
అంతేకాదు, దీన్ని కన్నడ చిత్ర పరిశ్రమలోనే తొలిసారి ఎక్కువ థియేటర్లలో విడుదల చేస్తున్నారు. దీంతో అడ్వాన్స్ బుకింగ్స్ కూడా ఎప్పుడో పూర్తైపోయాయి. ఇప్పటికే పలు ప్రాంతాల్లో షోలు కూడా ప్రదర్శితం అయ్యాయి. ఇప్పటి వరకూ అందిన సమాచారం ప్రకారం.. ఈ సినిమాకు అన్ని ఏరియాల్లోనూ అదిరిపోయే టాక్ వచ్చింది. అసలు ఇందులో మైనస్‌లే లేవన్నట్లుగా ప్రేక్షకులు ట్వీట్లు చేస్తున్నారు. ఫస్టాఫ్ ఇలా.. సెకెండాఫ్ ఇలాగ ‘జేమ్స్’ మూవీ ఓవరాల్‌గా చూసుకుంటే.. ఫస్టాఫ్ మొత్తం పునీత్ రాజ్‌కుమార్ మాస్ ఇంట్రో సీన్‌తో పాటు ఇంటర్వెల్ ట్విస్ట్‌తో యాక్షన్ ప్యాక్‌లా సాగిపోతుందట. మరీ ముఖ్యంగా ఇంటర్వెల్ బ్యాంగ్ హైలైట్‌గా ఉంటుందట. అలాగే, సెకెండాఫ్ కూడా అదే రితిలో ఉంటూ కొన్ని భావోద్వేగాలతో కూడిన సన్నివేశాలతో సాగుతుందట. క్లైమాక్స్ కూడా ఆకట్టుకునేలా డిజైన్ చేశారని టాక్. సినిమాలో ప్లస్… తొలిసారి ఇలా పునీత్ రాజ్‌కుమార్ నటించిన చివరి చిత్రం కావడంతో ‘జేమ్స్’ మూవీని అందరూ పాజిటివ్‌గానే చూస్తున్నారు.
దీంతో ఈ సినిమాలో హీరో క్యారెక్టరైజేష్, కథ, కథనం, యాక్షన్ సీక్వెన్స్‌లు, బ్యాగ్రౌండ్ స్కోర్, ఇంటర్వెల్ బ్యాంగ్, క్లైమాక్స్, మరీ ముఖ్యంగా పునీత్ స్క్రీన్ ప్రజెన్స్ ఇలా ఎన్నో ప్లస్‌లు ఉన్నాయట. కానీ, దీనికి సినీ చరిత్రలోనే తొలిసారి మైనస్‌లు ఎవరూ చెప్పడం లేదు. ఫైనల్‌గా సినిమా ఎలా ఉంది.. ఇప్పటి వరకూ అందిన సమాచారం ప్రకారం.. పునీత్ రాజ్‌కుమార్ నటించిన ‘జేమ్స్’ మూవీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా పూర్తిగా అభిమానులను అలరించే చిత్రం అని తెలుస్తోంది. ఇందులో అన్నీ అదుర్స్ అనేలా ఉన్నాయట. ఇప్పటికే కర్నాటక మొత్తం పునీత్ నామస్మరణ వినిపిస్తోంది.