Saturday, November 23, 2024

అధికారక లాంఛనాలతో లతాజీ అంత్యక్రియలు.. నివాళులర్పించిన ప్రధాని మోడీ

లెజండరీ సింగర్​, భారతరత్న అవార్డు గ్రహీత అయిన లతా మంగేష్కర్ భౌతికకాయాన్ని ముంబయిలోని పెద్దర్ రోడ్ నివాసం అయిన ప్రభు కుంజ్ నుండి శివాజీ పార్క్ కు తీసుకువెళ్లారు, అక్కడ లతాజీ అంత్యక్రియలు ఇవ్వాల సాయంత్రం అధికారిక లాంఛనాలతో ముగిశాయి.

కాగా, ముంబైలోని శివాజీ పార్క్ లో లెజెండరీ సింగర్ లతా మంగేష్కర్‌కు ప్రధాని నరేంద్ర మోదీ నివాళులర్పించారు. ప్రధాని మోదీ శివాజీ పార్క్ వద్ద లతా మంగేష్కర్‌ పార్థివ దేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆమె భౌతికకాయానికి పరిక్రమ [పూజతో చుట్టూ ప్రదక్షిణలు] నిర్వహించారు. ఈ సందర్భంగా లతా మంగేష్కర్ సోదరి, గాయని ఆశా భోంస్లే, ఆమె కుటుంబ సభ్యులకు ప్రధాని తన సంతాపాన్ని తెలిపారు.  వేదిక వద్ద ఉన్న మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే, మహారాష్ట్ర నవనిర్మాణ సేన అధినేత రాజ్ ఠాక్రేలను కూడా ప్రధాని మోదీ కలిశారు.

కాగా, లతా మంగేష్కర్‌కు నివాళిగా యావత్​ దేశం రెండు రోజుల పాటు సంతాప దినాలు పాటించనుంది. రెండు రోజుల పాటు జాతీయ జెండా సగం వరకు ఎగరేయనున్నారు.

లతా మంగేష్కర్​ ను యాది చేసుకుంటూ సైకత శిల్పి సుదర్శన్​ పట్నాయక్​ లతాజీ చిత్రాన్ని ఇసుకలో తీర్చిదిద్దారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement