లెజెండరీ గాయకురాలు లతా మంగేష్కర్ హెల్త్ బాగానే ఉందని త్వరగా కోలుకుంటున్నట్టు హాస్పిటల్ వర్గాలు తెలిపాయి. దీనికి ట్రయల్‌గా వెంటిలేటర్‌ను కూడా తీసివేసినట్లు ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు. కాగా, లతా మంగేష్కర్ (92) COVID-19 పాజిటివ్ వచ్చిన తర్వాత జనవరి ప్రారంభం నుండి ముంబైలోని బ్రీచ్ క్యాండీ హాస్పిటల్‌లోని ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో ఉన్నారు. కొవిడ్, న్యుమోనియా నుంచి కోలుకోవడానికి డాక్టర్ ప్రతీత్ సమ్దాని చికిత్స అందిస్తున్నారు. అయితే ఆమెకు తేలికపాటి కొవిడ్ లక్షణాలున్నాయని, ఆమె వయస్సు కారణంగా ముందుజాగ్రత్తగా ICUకి తీసుకెళ్లామని ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు.
లతా మంగేష్కర్ ఆరోగ్యంపై తాజా అప్‌డేట్ అందించారు ఆమె కుటుంబ సభ్యులు.. “లతా దీదీ ముంబైలోని బ్రీచ్ కాండీ హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ ICUలో కొనసాగుతున్నారు. ఆమెకు ఈరోజు ఉదయం ట్రయల్ ఆఫ్ ఎక్స్ ట్యూబేషన్ (ఆఫ్ ఇన్వేసివ్ వెంటిలేటర్) ఇవ్వబడింది. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం బాగానే ఉంది. కానీ, ఇంకా డాక్టర్ ప్రతీత్ సమ్దానీ నేతృత్వంలోని వైద్యుల బృందంలోనే చికిత్స కొనసాగుతుంది. అభిమానుల ప్రార్థనలు,శుభాకాంక్షలకు ధన్యవాదాలు” అని లతా మంగేష్కర్ అధికారిక హ్యాండిల్ ద్వారా ట్వీట్ చేశారు. లతా మంగేష్కర్ కుటుంబ సభ్యులు ఆమె ఆరోగ్యంపై ఎప్పటికప్పుడు అప్‌డేట్ ఇస్తున్నారు. ఆమె పరిస్థితి గురించి పుకార్లు వ్యాప్తి చేయకుండా హెచ్చరిస్తున్నారు. అంతేకాకుండా రాజకీయ నాయకురాలు, మాజీ నటి స్మృతి ఇరానీ గతంలో లతా మంగేష్కర్ ఆరోగ్యం గురించి ఊహాగానాలు మానుకోవాలని విజ్ఞప్తిని చేశారు