బాలీవుడ్ దిగ్గజ గాయని లతా మంగేష్కర్(92) ఇక లేరు. అనారోగ్యంతో ఆమె కన్నుమూశారు. కోవిడ్ కారణంగా గత కొద్ది రోజులుగా ముంబైలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఈ రోజులు తుది శ్వాస విడిచారు. లతా మంగేష్కర్ ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో ఉదయం 8:12 గంటలకు తుది శ్వాస విడిచారు.
92 ఏళ్ల లతా మంగేష్కర్ కోవిడ్ బారిన పడటంతో జనవరి 11న ముంబైలోని బ్రీచ్ కాండీ హాస్పిటల్‌లో చేరారు. డాక్టర్ ప్రతిత్ సందాని నేతృత్వంలోని వైద్యుల బృందం ఆమెకు చికిత్సలు అందించింది. కొద్ది రోజుల క్రమం ఆరోగ్యం మెరుగు పడింది. అయితే, లతా మంగేష్కర్ ఆరోగ్య పరిస్థితి మళ్లీ క్షీణించింది. దీంతో ఐసీయూలో వెంటిలేటర్‌పైనే ఉంచి ఆమెకు చికిత్సను అందించారు. ఈ క్రమంలో ఈ రోజులు కన్నుమూశారు. ఎన్నో వేల పాటలు పాడిన లతా మంగేష్కర్‌ను నైటింగేల్ ఆఫ్ ఇండియాగా కీర్తిస్తుంటారు. గాన కోకిల పేరు పొందిన లతా మంగేష్కర్‌కు ఎన్నో అవార్డులు వచ్చాయి.