Tuesday, November 19, 2024

TS | మల్టీ జోన్​‌‌–1లో పెద్ద ఎత్తున బదిలీలు.. 49 మంది ఇన్​స్పెక్టర్ల ట్రాన్స్​ఫర్​, పోస్టింగులు

పెద్దపల్లి, (ప్రభన్యూస్‌): మల్టీ జోన్‌ వన్‌ పరిధిలో పనిచేస్తున్న ఇన్​స్పెక్టర్లను బదిలీ చేస్తూ ఐజీ చంద్రశేఖర్‌రెడ్డి ఇవ్వాల (మంగళవారం) ఉత్తర్వులు జారీ చేశారు. బదిలీలకు సంబంధించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. పెద్దపల్లి సీఐగా పనిచేస్తున్న ప్రదీప్‌ కుమార్‌ను కరీంనగర్‌ రూరల్‌కు, రామగుండం ట్రాఫిక్‌లో పనిచేస్తున్న అనిల్‌ను పెద్దపల్లి సిఐగా, తాండూరు సిఐగా పనిచేస్తున్న జగదీష్‌ను సుల్తానాబాద్‌ సిఐగా బదిలీ చేశారు. ఇక.. సుల్తానాబాద్‌లో పని చేస్తున్న ఇంద్రసేనారెడ్డిని తిమ్మాపూర్‌కు, రామగుండం ఎస్‌బిలో పనిచేస్తున్న సత్యనారాయణ పెద్దపల్లి ట్రాఫిక్‌ ఇన్స్పెక్టర్‌గా, రామగుండం లీగల్‌ సెల్‌లో ఉన్న ముత్తులింగంను శ్రీరాంపూర్‌కు పంపించారు.

కరీంనగర్‌ ఎస్బిలో పని చేస్తున్న సంతోష్‌ను హుజురాబాద్‌ రూరల్‌కు, జగిత్యాలలో పనిచేస్తున్న రామచందర్‌ రావును కరీంనగర్‌ టూ టౌన్‌కు, రామగుండం ఎస్‌బిలో పనిచేస్తున్న శ్రీనివాస్‌ను కరీంనగర్‌ త్రీ టౌన్‌కు, ధర్మపురి సిఐగా పనిచేస్తున్న కోటేష్‌ను మల్యాలకు, మల్యాలలో పనిచేస్తున్న రమణమూర్తిని ధర్మపురికి, సిరిసిల్ల సిసిఎస్‌లో పనిచేస్తున్న కిషోర్‌ ను జమ్మికుంట రూరల్‌కు, కరీంనగర్ వన్ టౌన్ లో పనిచేస్తున్న నటేష్ కు జగిత్యాల టౌన్ కు, కరీంనగర్ రూరల్ లో పని చేస్తున్న విజ్ఞాన్ రావు ను పిసిఆర్ కు, శ్రీరామ్ పూర్ లో పనిచేస్తున్న రాజును ఐజి కార్యాలయానికి, జమ్మికుంట రూరల్ లో పని చేస్తున్న సురేష్ ను ఆసిఫాబాద్ టౌన్ కు, ఆసిఫాబాద్ టౌన్ లో పనిచేస్తున్న రాణా ప్రతాప్ ను అసిఫాబాద్ ఎస్ బి కి వేశారు

.

- Advertisement -

కరీంనగర్ టూ టౌన్ లో పనిచేస్తున్న లక్ష్మీ బాబుకు రామాయణపేట, తిమ్మాపూర్‌లో పని చేస్తున్న రమేశ్‌ను కరీంనగర్‌ ట్రాఫిక్‌-1కు, రవీందర్‌ను కరీంనగర్‌ ట్రాఫిక్‌-2కు, టాస్క్‌ఫోర్స్‌లో పని చేస్తున్న సృజన్‌ రెడ్డిని కరీంనగర్‌ ఎస్‌బీ-2కు, సీసీఆర్‌బీలో పని చేస్తున్న వెంకటనర్సయ్యను టాస్క్‌ఫోర్స్‌కు, సరిలాల్‌ను టాస్క్‌ఫోర్స్‌కు, కరీంనగర్‌ త్రీటౌన్‌లో పని చేస్తున్న దామోదర్‌రెడ్డికి సీసీఆర్‌బీకి, ట్రాఫిక్ కరీంనగర్ లో పనిచేస్తున్న తిరుమల్ ను కరీంనగర్ ఎస్ బి కి, రామయంపేట్ లో పనిచేస్తున్న చంద్రశేఖర్ కు రెడ్డి కి ఐజి కార్యాలయానికి, హుజరాబాద్ రూరల్ పనిచేస్తున్న జనార్దన్ ను ఐజి కార్యాలయానికి, ట్రాఫిక్ అదిలాబాద్ లో పనిచేస్తున్న అశోక్ ను ఆదిలాబాద్ టు టౌన్ కు, ఆదిలాబాద్ టూ టౌన్ లో పనిచేస్తున్న పురుషోత్తం ఐజి కార్యాలయానికి, వరంగల్ కమిషనరేట్ లో పనిచేస్తున్న వినయ్ ని పాల్వంచకు, పాల్వంచలో పని చేస్తున్న నాగరాజును ఐజి కార్యాలయానికి, వరంగల్ సిసిఆర్బిలో పని చేస్తున్న రమేష్ ను కొత్తగూడెం టూ టౌన్ కు నియమించారు.

కొత్తగూడెం టూ టౌన్ లో ఉన్న రాజును మరిపెడకు, మరిపెడ లో ఉన్న సాగర్ ను ఐజి కార్యాలయానికి, మహబూబాబాద్ డిసిఆర్బి లో ఉన్న ఫణిందర్ ను గూడూరు కు, గూడూరులో పనిచేస్తున్న షేక్ యాసిన్ ను ఐజి కార్యాలయానికి, గూడెం డీసీఆర్ లో పనిచేస్తున్న ఉపేందర్రావును డోర్నకల్ కు, డోర్నకల్ లో పనిచేస్తున్న వెంకటరత్నం ను వరంగల్ కమిషనరేట్ కు, ఉట్నూర్ లో పనిచేస్తున్న సైదారావుకు ఆదిలాబాద్ రూరల్ కు, రూరల్ లో పని చేస్తున్న రఘుపతిని ఐజి కార్యాలయానికి, ఇచ్చోడలో పనిచేస్తున్నాను నైలును భైంసా రూరల్ కు, మహబూబాబాద్ సిసిఎస్ లో పనిచేస్తున్న శ్రీనివాస్ జూలూరుపాడుకు, జూలూరుపాడు లో పనిచేస్తున్న వసంత్ ను ఐజి కార్యాలయానికి బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

కాగా, రామగుండం కమిషనరేట్ లో పనిచేస్తున్న కరుణాకర్ ను వరంగల్ కమిషనరేట్కు, భీమేష్ ను సిసిఎస్ మహబూబాబాద్ కు, బైంసా రూరల్ లో పనిచేస్తున్న చంద్రశేఖర్ను ఇచ్చోడకు, పవన్ కుమార్ ఆసిఫాబాద్ లో ఉన్న పవన్ కుమార్ ను మహబూబాబాద్ డిసిఆర్బికి, కరీంనగర్ సిసిఆర్బి లో పనిచేస్తున్న రాజేష్ ను ఐజి కార్యాలయానికి, ట్రాఫిక్ లో పనిచేస్తున్న నాగార్జునను ఐజి కార్యాలయానికి బదిలీ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement