తెలంగాణలో ఇంటింటికీ తాగు నీటి సరఫరా కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన మిషన్ భగీరథపై విచారణ చేపట్టేందుకు కేంద్రం రంగంలోకి దిగింది. ఈ దర్యాప్తు కోసం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకాధికారిని నియమించింది. ఈ మేరకు సోమవారం కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మిషన్ భగీరథ పథకానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు వ్యయం చేసింది. అయితే జల జీవన్ కమిషన్ ఇటీవలే ఈ పథకం అమలు తీరుపై సర్వే నిర్వహించింది. ఈ కమిషన్ సర్వే రిపోర్టు ఇటీవలే కేంద్రానికి అందగా.. ఆ నివేదిక ఆధారంగా పథకంపై కేంద్ర జల వనరుల మంత్రిత్వ శాఖకు ఓ ఫిర్యాదు అందింది. ఈ ఫిర్యాదును ఆధారం చేసుకుని పథకంపై దర్యాప్తునకు కేంద్రం ఆదేశాలు జారీ చేసింది.
Breaking: మిషన్ భగీరథలో పెద్ద ఎత్తున నిధులు వ్యయం.. దర్యాప్తునకు ఆదేశించిన కేంద్రం
Advertisement
తాజా వార్తలు
Advertisement