Tuesday, November 26, 2024

Donations: రీజనల్​ పార్టీలకు పెద్దమొత్తంలో విరాళాలు.. ఇవిగో ఆధారాలు!

దేశంలోని ప్రాంతీయ రాజకీయ పార్టీలు అందుకున్న మొత్తం విరాళాల్లో దాదాపు 91 శాతం అంటే రూ. 113.791 కోట్లు ఐదు పార్టీలకు చేరాయని పోల్ రైట్స్ బాడీ అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) వివరాలు వెల్లడించింది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో భారత ఎన్నికల సంఘానికి (ECI) ప్రాంతీయ పార్టీలు నివేదించిన విరాళాల వివరాలను ADR  బయటపెట్టింది. కాగా, విరాళాలు ప్రకటించిన మొదటి ఐదు ప్రాంతీయ పార్టీల్లో జనతాదళ్ (యునైటెడ్), ద్రవిడ మున్నేట్ర కజగం (DMK), ఆమ్ ఆద్మీ పార్టీ (AAP), ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ (IUML), తెలంగాణ రాష్ట్ర సమితి (TRS) ఉన్నాయి. ప్రాంతీయ పార్టీలకు అందిన మొత్తం విరాళాల్లో 91.38 శాతం అంటే రూ.113.791 కోట్లు ఈ ఐదు పార్టీల ఖజానాలోకి చేరినట్టు తెలుస్తోంది.

– డిజిటల్​ మీడియా, ఆంధ్రప్రభ

JD(U), DMK, TRS తమ విరాళాలలు మరింత పెరిగినట్టు ప్రకటించగా.. AAP, IUML 2019-20 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే విరాళాలు తగ్గినట్లు వెల్లడించాయి. కాగా, DMK, TRS, JD(U), మహారాష్ట్ర నవనిర్మాణ సేన (MNS) 2019-20 ఫైనాన్షియల్​ ఇయర్​ కంటే.. 2020-21 లో విరాళాల ద్వారా వారి ఆదాయం గరిష్ఠంగా పెరిగినట్టు చూపాయి.  నివేదికలో పొందుపరచబడిన 54 ప్రాంతీయ పార్టీల్లో కేవలం ఆరు మాత్రమే తమ విరాళాల నివేదికలను నిర్ణీత వ్యవధిలో భారత ఎన్నికల సంఘానికి (ECI)  సమర్పించాయి. 25 ఇతర పార్టీలు తమ వివరాలు అందజేయడంలో మూడు రోజుల నుండి 164 రోజుల దాకా ఆలస్యం చేశాయి.

కాగా, 27 ప్రాంతీయ పార్టీలు ప్రకటించిన విరాళాల మొత్తం, 20,000 పైన, అంతకంటే తక్కువ మొత్తం కలిపి, 3,051 విరాళాల నుండి రూ.124.53 కోట్లుగా ఉంది. 2020-21 ఏడాదికి సంబంధించి  JMM, NDPP, DMDK, RLTP విరాళాల వివరాలు తెలియజేయలేదు.

ఇక.. పార్టీలు అందుకన్న విరాళాల విషయానికొస్తే.. 330 విరాళాల నుండి 60.155 కోట్ల రూపాయలతో JD(U) అగ్రస్థానంలో ఉంది. 177 విరాళాల నుండి 33.993 కోట్ల రూపాయలను అందుకున్న డీఎంకే తర్వాతి స్థానంలో ఉంది. AAP రూ. 11.328 కోట్లు అందుకున్నట్లు ప్రకటించింది. – ప్రాంతీయ పార్టీలలో మూడవ అత్యధికం. ఐయుఎంఎల్‌ రూ. 4.165 కోట్లు, టీఆర్‌ఎస్‌ రూ. 4.15 కోట్లు విరాళాలు అందినట్టు ప్రకటించాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement