ఇప్పటికే పలు వైరస్ లతో సతమతమవుతోంటే చైనాలో మరో వైరస్ కలకలం సృష్టిస్తోంది. అదే లాంగ్యా హెనిపా వైరస్. చైనాలోని షాంగ్ డాంగ్, హెనాన్ రాష్ట్రాల్లో ఈ వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతోంది. ఇప్పటికే ఈ వైరస్ 35 మందికి సోకినట్లు తైవాన్ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ (సీడీసీ) వెల్లడించింది. ఈ వైరస్ జంతువుల నుంచి మనుషులకు సంక్రమించిందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వైరస్ సోకిన బాధితుల్లో జ్వరం, దగ్గు, ఆకలి లేకపోవడం, కండరాల నొప్పులు, వికారం వంటి లక్షణాలు ఎక్కువగా ఉంటాయన్నారు. ‘ఇటీవల ఓ రోగికి అధిక జ్వరం వచ్చిందని, ఈ క్రమంలో అతడు ఆస్పత్రికి వెళ్లాడు. వైద్యులు అతడి బ్లడ్ శాంపిళ్లను సేకరించి పరీక్షలు నిర్వహించారు. అతడి బ్లడ్ శాంపిళ్లలో లాంగ్యా హెనిపా వైరస్‌ను గుర్తించారు. అనంతరం అప్రమత్తమైన ప్రభుత్వం స్థానిక ప్రాంతాల్లో పరీక్షలు నిర్వహించారు. 35 మంది వైరస్ సోకినట్లు న్యూ ఇంగ్లాండ్ జర్నల్‌లో ఆర్టికల్ ప్రచురితమైంది.
Advertisement
తాజా వార్తలు
Advertisement